Israel Omega Drill : ఇజ్రాయెల్ నేషనల్ కొవిడ్‌ డ్రిల్.. ప్రపంచంలోనే ఫస్ట్.. భవిష్యత్తు వేరియంట్లను ఎదుర్కొవడమే టార్గెట్!

కరోనావైరస్ కట్టడికి ఇజ్రాయెల్ నడుం బిగించింది. ప్రపంచంలోనే మొదటి దేశంగా ఇజ్రాయెల్ నేషనల్ కొవిడ్ డ్రిల్ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా వార్ గేమ్స్ (Omega Drill)కు పిలుపునిచ్చింది.

In World 1st, Israel To Hold National Drill To Prepare For Future Covid Variants(2)

Israel Omega Covid Drill : ప్రపంచమంతంటా కరోనావైరస్ మహమ్మారి వ్యాపించింది. కరోనావైరస్ ప్రభావం తగ్గినట్టు తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. కొత్తకొత్త వేరియంట్లు, స్ట్రెయిన్లు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనావైరస్ కట్టడికి ఇజ్రాయెల్ ఒక అడుగు ముందు వేసింది. ప్రపంచంలోనే మొదటి దేశంగా ఇజ్రాయెల్ నేషనల్ కొవిడ్ డ్రిల్ ప్రారంభించింది. దేశవ్యాప్తంగా వార్ గేమ్స్ పేరిట (Omega Drill)కు పిలుపునిచ్చింది. ఈ కొవిడ్ డ్రిల్ ద్వారా ఇజ్రాయెల్ భవిష్యత్తులో ఎదుర్కొబోయే కొవిడ్ వేరియంట్లపై సంసిద్ధంగా ఉండేందుకు ముందే కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. దేశ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ (Naftali Bennett) నేతృత్వంలో ఈ నేషనల్ కొవిడ్ డ్రీల్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని పరీక్షించడానికి ఈ డ్రీల్ ప్రారంభించింది. మొత్తం మూడు సెషన్లలో ఈ డ్రిల్ కొనసాగనుంది. ప్రస్తుత కొవిడ్-19 వ్యాప్తిని ఎలా కంట్రోల్ చేయాలి? భవిష్యత్తు వేరియంట్లను ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు ఏమి చేయాలి? ఎలాంటి వనరులు అవసరం? ఎందులో ముందున్నాం.. వేటిలో వెనుకబడి ఉన్నాం.. ఇలా అనేక అంశాలపై పూర్తిగా డ్రీల్ చేపట్టనుంది.

వేరియంట్లపై పర్యవేక్షణతో పాటు లాక్ డౌన్ పాలసీలపై నిర్ణయాలు, పౌరులకు ఆర్థిక సహాయాన్ని అందించడం, సరిహద్దుల్లో రాకపోకలు, క్వారంటైన్ వంటి విధానాలను ఈ డ్రిల్ నిశితంగా గమనించనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని బెన్నెట్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్ పరిస్థితి అద్భుతంగా ఉంది. కరోనా నాల్గో వేవ్ ను సమర్థవంతంగా కట్టడిలో విజయవంతమయ్యాం. దేశంలో డెల్టా వేరియంట్ వ్యాప్తిని నియంత్రించే దిశగా అడుగులు వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నాము’ అని ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రోజువారీ కార్యకలాపాలను నిలిపివేయడం లేదన్నారు. నిర్వహణ వ్యవస్థలను మూసివేయడం లేదన్నారు. వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నామని బెన్నెట్ పేర్కొన్నారు. ప్రపంచంలో కరోనావైరస్ తీవ్రస్థాయిలో ఉండగా.. ఇజ్రాయెల్ సురక్షితంగా ఉందన్నారు. అందుకోసం నిరంతరం శ్రమిస్తునే ఉన్నామని తెలిపారు.

నేషనల్ డ్రిల్ అనేది వార్-గేమ్ ఫార్మాట్‌లో నిర్వహించనున్నట్టు ప్రధాని బెన్నెట్ వెల్లడించారు. సీనియర్-స్థాయి నుంచి ఇంటర్-ఆర్గనైజేషనల్ సిమ్యులేషన్‌ కలిగి ఉంటుందన్నారు. దేశంలో కనిపించని కొత్త స్ట్రెయిన్ ‘Omega’ స్ట్రెయిన్‌ స్థితిని ఎప్పటికప్పుడూ ఈ డ్రిల్ ద్వారా పరీక్షించనున్నారు. ఈ స్ట్రెయిన్ ఇజ్రాయెల్ దేశంలోకి ప్రవేశించినట్టుగా ఇంకా అధికారికంగా గుర్తించలేదు. ఈ స్ట్రెయిన్ వ్యాప్తిచెందుతునే ఊహాగానాల నేపథ్యంలో నేషనల్ కొవిడ్ డ్రిల్ మొదలుపెట్టింది ఇజ్రాయెల్ ప్రభుత్వం. ఈ కొవిడ్ డ్రిల్‌.. అనేది కొన్ని ప్రధాన దశల్లో కొనసాగనుంది.

• విధాన అంశాలు: సమావేశాలను పరిమితం చేయడం, కదలికలను పరిమితం చేయడం, క్వారంటైన్ పాలసీ, ఈవెంట్ ప్లాన్‌లు (సెలవులు మొదలైనవి), దేశవ్యాప్త లాక్‌డౌన్‌లు/కర్ఫ్యూలు, పర్యాటకం మొదలైనవి ఉంటాయి.
• ఆరోగ్య అంశాలు: ఆస్పత్రి సామర్థ్యం, ​టీకాలు (బూస్టర్ మోతాదులు, ఇతర టీకాలు మొదలైనవి), డేంజరస్ వేరియంట్ వ్యాప్తిపై పర్యవేక్షణ, హెచ్చరికలు, వ్యాక్సిన్‌లతో రక్షణను పరీక్షించడం, ఎపిడెమియోలాజికల్ పరిశోధనలు, పరీక్షలు చేయడం.
• చట్టపరమైన అంశాలు: స్థానిక లేదా ప్రాంతీయ లాక్‌డౌన్‌లు/కర్ఫ్యూలు, ఆంక్షల విధానం, నిబంధనల ఆమోదం
• ఆర్థిక అంశాలు: జాతీయంగా ఆర్థిక సహాయం చేయడం, దేశ జనాభాకు ఆర్థికంగా ఆదుకోవడం
• ప్రజా భద్రతా అంశాలు: క్వారంటైన్ల అమలు, స్థానిక లాక్‌డౌన్‌లు/కర్ఫ్యూలు, నిబంధనల అమలు
• విద్యా విధానం: విద్యార్థుల ఆరోగ్య రక్షణ, తరగతుల సంఖ్యను తగ్గించడం, వైరస్ ప్రభావిత పాఠశాలలను మూసివేయడం, విద్యా ప్రణాళికలను మార్చడం (క్యాప్సూల్స్, రిమోట్ లెర్నింగ్)
• బెన్-గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయం, సరిహద్దు క్రాసింగ్‌లు: సరిహద్దుల్లో రాకపోకలపై విధానాలు, నియంత్రణ, ప్రభావిత ప్రాంతాలను మూసివేయడం.

కోవిడ్-19 బారినపడిన ఇజ్రాయెల్‌ల సంఖ్య ఆగస్టు చివరి నాటికి 700 నుంచి నవంబర్ 10 నాటికి 149కి పడిపోయింది, అయితే రోజువారీ కొత్త ఇన్‌ఫెక్షన్ల సంఖ్య రోజుకు దాదాపు 10,000 నుండి కేవలం 500 కంటే తక్కువకు పడిపోయింది. ఈ నెలలో పూర్తిగా టీకాలు తీసుకున్న పర్యాటకులకు ఇజ్రాయెల్ అనుమతినిచ్చింది. ఇకపై 5 ఏళ్ల నుంచి 11 ఏళ్ల పిల్లలకు కూడా టీకాలు వేసేందుకు ఇజ్రాయెల్ రెడీ అవుతోంది.
Read Also : Samsung Cleaning Cloth : ఆపిల్‌కు పోటీగా శాంసంగ్ ఫన్ ప్రమోషన్ ఆఫర్..!