Samsung Cleaning Cloth : ఆపిల్‌కు పోటీగా శాంసంగ్ ఫన్ ప్రమోషన్ ఆఫర్..!

ఆపిల్‌‌కు పోటీగా సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ కూడా క్లీనింగ్ క్లాత్ ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం Galax Clubలో కొత్త ప్రమోషన్ కూడా మొదలుపెట్టింది.

Samsung Cleaning Cloth : ఆపిల్‌కు పోటీగా శాంసంగ్ ఫన్ ప్రమోషన్ ఆఫర్..!

Samsung Pokes Fun At Apple’s Polishing Cloth By Offering One Of Its Own For Free

Updated On : November 11, 2021 / 5:09 PM IST

Apple Polishing Cloth : ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఇటీవలే టన్నుల కొద్ది కొత్త ప్రొడక్టులను ఆవిష్కరించింది. MacBook Pro మోడల్స్ సహా M1 Pro M1 Max ప్రాసెసర్లు ఇలా మరెన్నో ఆకర్షణీయమైన ప్రొడక్టులను లాంచ్ చేసింది. అందులో ఆపిల్ ప్రొడక్టుల కోసం ప్రత్యేకించి సరికొత్త క్లీనింగ్ క్లాత్ కూడా ప్రకటించింది ఆపిల్. దీనివిలువ 19 డాలర్లు. ఇప్పుడు ఆపిల్‌‌కు పోటీగా సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ కూడా క్లీనింగ్ క్లాత్ ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం Galax Clubలో కొత్త ప్రమోషన్ కూడా మొదలుపెట్టింది. జర్మనీలోని శాంసంగ్ మెంబర్లకు మాత్రమే ఈ కొత్త ప్రమోషన్ ఆఫర్ అందుబాటులో ఉంది .

జర్మనీ శాంసంగ్ యూజర్లలో మొదటి 1000 మంది యూజర్లకు మాత్రమే ఈ ప్రమోషన్ ఆఫర్ కొట్టేసే ఛాన్స్ దక్కనుంది. ప్రమోషన్ ఆఫర్ దక్కించుకునే వారు ఉచితంగా Cleaning Cloth సొంతం చేసుకోవచ్చు. ఇకపై తమ గెలాక్సీ ఫోన్లను క్లీనింగ్ క్లాత్ తో క్లీన్ చేసుకోవచ్చు. ఆపిల్ అందించే క్లీనింగ్ కాత్ కంటే శాంసంగ్ క్లీనింగ్ క్లాత్ సైజు 20x20cm పెద్దదిగా ఉంటుంది. చూడటానికి ఇతర మైక్రోఫైబర్ క్లాత్ మాదిరిగా మెరిసిపోతుంది. శాంసంగ్ క్లీనింగ్ క్లాత్ (Samsung Cleaning Cloth) ద్వారా మీ PC Monitor లేదా Tablet కూడా చక్కగా క్లీనింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి శాంసంగ్ ప్రమోషన్ ఆఫర్ కేవలం జర్మన్లకు మాత్రమే కనిపిస్తుంది.

రాబోయే రోజుల్లో ఈ కొత్త ప్రమోషన్ ఆఫర్ ను ప్రపంచమంతటా అందుబాటులోకి తెస్తుందో లేదో క్లారిటీ ఇవ్వలేదు. ఆపిల్ కు పోటీగా శాంసంగ్ ఇలాంటి ప్రమోషన్ ఆఫర్ ప్రకటించడం ఇదేం మొదటిసారి కాదు.. 2017లోనూ కంపెనీ ఫన్ కోసం ఆపిల్ కు పోటీగా ప్రమోషన్ ఆఫర్ తీసుకొచ్చింది. ఆపిల్ ఐఫోన్లలో (iPhone X notch) 3.5mm హెడ్ ఫోన్ జాక్ ను ఐఫోన్ల నుంచి రిమూవ్ చేసింది. కొన్ని నెలల తర్వాత శాంసంగ్ కూడా తమ Galaxy Note 10 Series ను హెడ్ ఫోన్ జాక్ లేకుండానే మార్కెట్లోకి విడుదల చేసింది. గత ఏడాది ఆపిల్ iPhone 12 సిరీస్ ఛార్జర్ లేకుండా బాక్సును విక్రయించింది. శాంసంగ్ కూడా ఇదే ప్రకటన చేస్తూ ఒక పోస్టు పెట్టింది. ఆ తర్వాత ఆ పోస్టు డిలీట్ చేసింది.
Read Also : Pandemic is Returning : జ‌ర్మ‌నీలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో కొత్త‌గా 50వేల కేసులు..