India asks China: రెచ్చగొట్టే చర్యలు ఆపండి.. చైనాకు తేల్చిచెప్పిన భారత్

సరిహద్దులో చైనా రెచ్చగొట్టే వైఖరిని భారత్ ప్రశ్నించింది. నిబంధనలు, ఒప్పందాలను ఉల్లంఘిస్తూ తరచూ చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుండటంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

India asks China: సరిహద్దుల్లో రెచ్చగొట్టే చర్యలకు స్వస్తి పలకాలని చైనాకు సూచించింది భారత్. నిబంధనలు, ఒప్పందాలను ఉల్లంఘిస్తూ తరచూ చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుండటంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు విషయంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఇటీవల భారత్-చైనా చర్చలు జరిపాయి.

Amit Shah: ఆగష్టు 5న కాంగ్రెస్ నిరసన.. రామ మందిరంతో లింకు.. అమిత్ షా ఏం చెప్పారంటే

రెండు దేశాల సైనికాధికారుల మధ్య, వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. భారత్ తరఫున మేజర్ జనరల్‌తోపాటు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎయిర్ కమాండర్ ఈ చర్చలకు నేతృత్వం వహించారు. రెండు దేశాల మధ్య చర్చల్లో ఎయిర్‌ఫోర్స్‌ అధికారి పాల్గొనడం ఇదే మొదటిసారి. ఈ చర్చల సందర్భంగా చైనా వైఖరిపై భారత్ తన నిరసన తెలియజేసింది. ఇటీవలి కాలంలో చైనాకు చెందిన యుద్ధ విమానాలు ఉత్తర లదాఖ్‌లోని భారత సరిహద్దు వైపు దూసుకొస్తున్నాయి. దీనికి భారత్ కూడా ధీటుగానే బదులిస్తోంది. విమానాల్ని గమనించగానే మన రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేస్తున్నారు.

Arpita Life Under Threat: అర్పితకు ప్రాణహాని.. పరీక్షించిన ఆహారమే ఇవ్వాలని కోర్టును కోరిన ఈడీ

అయితే, ఒప్పందం ప్రకారం.. ఎల్ఏసీ వద్ద చైనా సైన్యం వెనక్కు వెళ్లాలని, చైనా సరిహద్దులోనే ఉండాలని సూచించింది. రెండేళ్ల నుంచి సరిహద్దు విషయంలో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇప్పటివరకు ఇరు దేశాలు 16సార్లు చర్చలు జరిపాయి.

 

ట్రెండింగ్ వార్తలు