Arpita Life Under Threat: అర్పితకు ప్రాణహాని.. పరీక్షించిన ఆహారమే ఇవ్వాలని కోర్టును కోరిన ఈడీ

పశ్చిమ బెంగాల్ టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కాంలో అరెస్టైన బెంగాలీ నటి అర్పితా ముఖర్జీకి ప్రాణహాని ఉన్నట్లు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందిందని ఈడీ తెలిపింది. అందుకే ఆమెకు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలని కోర్టును కోరింది.

Arpita Life Under Threat: అర్పితకు ప్రాణహాని.. పరీక్షించిన ఆహారమే ఇవ్వాలని కోర్టును కోరిన ఈడీ

Updated On : August 5, 2022 / 7:44 PM IST

Arpita Life Under Threat: పశ్చిమ బెంగాల్ టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కాంలో అరెస్టైన అర్పితా ముఖర్జీకి ప్రాణహాని ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. అందుకే ఆమెకు ఇచ్చే ఆహారం, నీళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, వాటిని పరీక్షించిన తర్వాతే ఆమెకు అందజేసేలా చూడాలని కోర్టును కోరింది ఈడీ.

Teacher Arrested: ట్యూషన్‌లో బాలికకు వోడ్కా తాగించిన టీచర్.. స్పృహ కోల్పోయిన విద్యార్థిని

ఈ కేసుకు సంబంధించిన విచారణ ప్రత్యేక కోర్టులో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన నిందితుడు పార్థా ఛటర్జీతోపాటు, అతడి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో అధికారులు ఇద్దరినీ జైళ్లకు తరలించారు. పార్థా ఛటర్జీని ప్రెసిడెన్సీ కరెక్షనల్ హోమ్‌కు తరలించగా, అర్పితా ముఖర్జీని అలిపోర్ ఉమెన్స్ కరెక్షనల్ హోమ్‌కు తరలించారు. ఇద్దరి భద్రత కోసం జైలు సూపరిండెంట్ ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 18 వరకు వీరు జైళ్లో ఉంటారు కాబట్టి, అప్పటివరకు భద్రతకు సంబంధించిన నివేదికను అధికారులకు అందజేయాలి. ఈ కేసుకు సంబంధించి అర్పితకు ప్రాణహాని ఉందని తమకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని, అందువల్ల ఆమెకు ప్రత్యేక భద్రత కల్పించాలని ఈడీ కోర్టును కోరింది.

Father kills Son: బైక్ కీ కోసం కొడుకు చేయి నరికిన తండ్రి.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి

అలాగే ఆమెకు అందించే ఆహారం, నీళ్లను కూడా ముందుగానే పరీక్షించాలని సూచించింది. అయితే, పార్థా ఛటర్జీకి ఎలాంటి హాని ఉన్నట్లు తమ దృష్టికి రాలేదని ఈడీ తెలిపింది. ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ రూ.50 కోట్ల నగదు, 5 కేజీల బంగారం స్వాధీనం చేసుకుంది.