Amit Shah: ఆగష్టు 5న కాంగ్రెస్ నిరసన.. రామ మందిరంతో లింకు.. అమిత్ షా ఏం చెప్పారంటే

ఆగష్టు ఐదో తేదీనే ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారని, దీనికి వ్యతిరేకం అని చెప్పే ఉద్దేశంలో భాగంగానే కాంగ్రెస్ ఈ రోజు నిరసన చేపట్టిందని అమిత్ షా విమర్శించారు.

Amit Shah: ఆగష్టు 5న కాంగ్రెస్ నిరసన.. రామ మందిరంతో లింకు.. అమిత్ షా ఏం చెప్పారంటే

Updated On : August 5, 2022 / 8:20 PM IST

Amit Shah: దేశంలో ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా శుక్రవారం నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇతర నేతలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. అయితే, ఆగష్టు ఐదో తేదీనే కాంగ్రెస్ నిరసన చేపట్టడానికి అసలు కారణం వేరే ఉందన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.

Teacher Arrested: ట్యూషన్‌లో బాలికకు వోడ్కా తాగించిన టీచర్.. స్పృహ కోల్పోయిన విద్యార్థిని

ఆగష్టు ఐదో తేదీనే ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేశారని, దీనికి వ్యతిరేకం అని చెప్పే ఉద్దేశంలో భాగంగానే కాంగ్రెస్ ఈ రోజు నిరసన చేపట్టిందని అమిత్ షా విమర్శించారు. ‘‘కాంగ్రెస్ ఈ రోజే ఎందుకు ప్రత్యేకంగా నిరసన చేపట్టింది? ప్రధాని నరేంద్ర మోదీ ఇదే రోజు అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేశారు. దీనికి వ్యతిరేకం అని చెప్పేందుకు, బుజ్జగింపు రాజకీయాలు చేసేందుకే కాంగ్రెస్ ఈ రోజు నిరసన చేపట్టింది. దీని ద్వారా వాళ్లు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.

Arpita Life Under Threat: అర్పితకు ప్రాణహాని.. పరీక్షించిన ఆహారమే ఇవ్వాలని కోర్టును కోరిన ఈడీ

ఢిల్లీలో కాంగ్రెస్ నిరసనల్ని పోలీసులు అడ్డుకున్నారు. రాహుల్ గాంధీతోపాటు, ప్రియాంకా గాంధీ, ఇతర నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు ఆరు గంటల తర్వాత వారిని వదిలిపెట్టారు. మరోవైపు ఈ నిరసనలపై బీజేపీ కూడా ధీటుగా బదులిస్తోంది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని గుర్తు చేస్తోంది.