Drone Tension In India-Pak Border : 9 నెలల్లో భారత్‌లోకి 191 పాక్ డ్రోన్లు .. పంజాబ్‌లో మరో పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చివేసిన BSF బలగాలు
పంజాబ్‌లోని గురుదాస్ పూర్ సెక్టార్ లో మరో పాకిస్థాన్ డ్రోన్ కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన BSF బలగాలు దానిని కూల్చివేసాయి.

Drone Tension In India-Pak Border
Drone Tension In India-Pak Border : భారత్ సరిహద్దుల్లో పాకిస్థాన్ తన కుక్కబుద్ధిని పదే పదే చూపించే పాకిస్థాన్ మరోసారి భారత్ భూభాగంలోకి డ్రోన్ ను పంపింది. పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ జవాన్లు కూల్చివేశారు. శుక్రవారం (అక్టోబర్ 14,2022) ఉదయం 4.30 గంటల సమయంలో గుర్దాస్పూర్ సెక్టార్లో ఉన్న భారత్-పాక్ అంతర్జాతీయ సరిహద్దుల్లో పాకిస్థాన్ వైపు నుంచి భారత్‌లోకి డ్రోన్ రావడాన్ని జవాన్లు గుర్తించారు. దానిపై కాల్పులు జరిపి దానిని జవాన్లు కూల్చివేశారు.
డ్రోన్ ను కూల్చివేసిన తరవాత ఆ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ప్రతీ అంగుళాన్ని జల్లెడపట్టారు. ఈ ఘటనపై బీఎస్ఎఫ్ డీఐజీ మాట్లాడుతూ డ్రోన్ సాయంతో సరిహద్దుల్లో ఏవైనా వస్తువులను వదిలారా అనేకోణంలో గాలిస్తున్నామని..ప్రతీ అంగుళాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఆ డ్రోన్ పాక్ నుంచి ఏదో కన్సైన్మెంట్ను తీసుకొచ్చిందని అనుమానం వ్యక్తంచేశారు.
Drone: భారత్-పాకిస్థాన్ సరిహద్దుల వద్ద డ్రోన్ కలకలం
కాగా గత తొమ్మిది నెలల్లో పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి 191 డ్రోన్లను పాక్ ఉపయోగించింది. నిరంతరం డేగ కళ్లతో అప్రమత్తంగా ఉంటున్న మన ఆర్మీ వాటిని ఎప్పటికప్పుడూ కూల్చిపారేస్తూనే ఉంది. అలా ఏడు పాక్ డ్రోన్లను భారత్ ఆర్మీ కూల్చివేసింది. భారత్ ను ఎప్పటికప్పుడు కవ్విస్తున్న పాక్ కుటిలబుద్ధికి మన ఆర్మీ తగిన బుద్ధి చెబుతున్నా పాక్ తీరు మారటంలేదు. ఈక్రమంలో పాక్ చర్యలతో సరిహద్దుల్లో భారీ భద్రతను కట్టుదిట్టం చేసింది భార్ ఆర్మీ.