విదేశీయులకు టూరిస్ట్ వీసా కేన్సిల్ : ఏప్రిల్ 15వరకూ ఇండియా దాటకూడదు

కరోనా మహమ్మారి అని WHO ప్రకటించిన కొద్ది గంటల్లోనే భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని దేశాలు ఇతర దేశాల నుంచి రాకపోకలు ఆపేశాయి. వాటితో పాటు భారత్ కూడా చేరిపోయింది. ఏప్రిల్ 15వరకూ ఇండియా దాటకూడదని అన్ని రకాల వీసాలను సస్పెండ్ చేసింది. 

ఇటలీ నుంచి వచ్చిన గ్రూపు కారణంగా భారత్‌లో 67మందికి వైరస్ సోకింది. ఈ క్రమంలో భారత్ నుంచి విదేశాలకు రాకపోకలు జరిపే వాళ్ల వీసాలను ఏప్రిల్ 15వరకూ ఆపేసింది. ఈ నిర్ణయాన్ని 2020 మార్చి 13నుంచి అమలులోకి తీసుకురానున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్ష వర్ధన్.. మంత్రులతో చర్చలు జరిపిన అనంతరం ప్రకటించారు. 

కొరియా, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీల నుంచి వచ్చే ప్రయాణికులకు కూడా నో ఎంట్రీ చెప్పేసింది. భారత్‌లో ఇప్పటి వరకూ 67కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ, కర్ణాటకలలో వైరస్ బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. 

చైనాలోని వుహాన్‌లో మొదలైన ఈ వైరస్ ప్రపంచవ్యాప్తంగా 110కి పైగా దేశాలు, ప్రాంతాలు లేదా భూభాగాలకు వ్యాపించింది లక్ష మందికి పైగా సోకింది. వైరస్ కారణంగా 4వేల మందికి పైగా మరణించారు.

See Also | జర్మనీలో 70శాతం మందికి కరోనా ప్రమాదం రావొచ్చు: ప్రధాని