India to overtake US : 2075 నాటికి భారత్ అమెరికాను అధిగమిస్తోంది…గోల్డ్‌మన్ సాచ్స్ సంచలన నివేదిక

భారతదేశం ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్ తాజాగా సంచలన నివేదిక వెల్లడించింది. 2075వ సంవత్సరం నాటికి భారతదేశం అమెరికాను అధిగమించి రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్ తెలిపింది....

Investment bank Goldman Sachs

World Second Largest Economy : భారతదేశం ఆర్థిక వ్యవస్థపై ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్ తాజాగా సంచలన నివేదిక వెల్లడించింది. 2075వ సంవత్సరం నాటికి భారతదేశం అమెరికాను అధిగమించి రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్ తెలిపింది. (world second largest economy) భారతదేశంలో రోడ్లు, రైల్వేల రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని బ్యాంకు నివేదిక పేర్కొంది.

Helicopter : నేపాల్ దేశంలో హెలికాప్టర్ మాయం..ఆరుగురు గల్లంతు

ప్రస్థుతం భారత్ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. అనుకూలమైన జనాభా, కొత్త ఆవిష్కరణలు, అధిక మూలధన పెట్టుబడులు, పెరిగిన కార్మికుల ఉత్పాదకతతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. కొత్త ఆవిష్కరణలు, కార్మికుల ఉత్పాదకత పెరగడంతో గణనీయమైన చోదక శక్తిగా మారుతుందని నివేదిక తెలిపింది. భారతదేశంలో పొదుపు రేటు పెరగడం వల్ల ఆర్థిక రంగ అభివృద్ధి చెందుతుందన్నారు. పొదుపుతో పెట్టుబడి మూలధనం పెరగనుందని నివేదిక పేర్కొంది.

Bengal Panchayat Election Result : బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఎంసీదే హవా

మౌలిక సదుపాయాల కల్పన, ఉద్యోగాల సృష్టితో ప్రైవేటు రంగం సామర్ధ్యం పెరుగుతుందని గోల్డ్ మన్ సాచ్స్ తెలిపింది. శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు పెరగకపోతే భారతదేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన ప్రతికూల ప్రమాదం అని నివేదిక పేర్కొంది. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యంరేటు పెంచాల్సిన అవసరం ఉందని బ్యాంక్ నివేదిక వివరించింది.