India Voted To Reject Russia: పుతిన్‌కు షాకిచ్చిన భారత్.. ఐరాస సర్వసభ్య సమావేశంలో రష్యాకు వ్యతిరేకంగా ఓటు.. ఎందుకంటే?

యుక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యా చట్టవిరుద్ధమైన విలీనాన్ని ఖండించే ముసాయిదా తీర్మానంపై యునైటెడ్ జనరల్ అసెంబ్లీ (UNGA)లో రహస్య బ్యాలెట్ కోసం రష్యా డిమాండ్‌ చేసింది. అయితే, అధికశాతం దేశాలు రష్యా డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ ఓటు వేశాయి. వాటిల్లో భారత్ కూడా ఒకటి.

PM Modi and Putin

India Voted To Reject Russia: రష్యాకు ఇండియా షాకిచ్చింది. ఐరాస సర్వసభ్య సమావేశంలో జరిగిన ఓటింగ్‌లో రష్యా డిమాండ్ ను తిరస్కరిస్తూ భారత్ ఓటు వేసింది. యుక్రెయిన్‌లోని దొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ అల్బానియా తీర్మానం ప్రతిపాదించింది. అయితే, రష్యా ఈ తీర్మానంపై రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ చేపట్టాలని డిమాండ్ చేసింది. రష్యా డిమాండ్ పై ఐరాస సర్వసభ్య సమావేశం ఓటింగ్ నిర్వహించగా.. 107 దేశాలు రష్యా డిమాండ్ వ్యతిరేకంగా ఓటు వేశాయి. కేవలం 13 దేశాలు మాత్రమే రష్యాకు అనుకూలంగా మద్దతు తెలిపాయి. మరో 39 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. ఓటింగ్ కు దూరంగా ఉన్న దేశాల్లో రష్యా, చైనా ఉండటం గమనార్హం.

Russia vs Ukraine War: తీవ్రరూపం దాల్చుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధం.. మేమున్నామంటూ జెలెన్‌స్కీకి జో బైడెన్ హామీ.. నేడు జీ7 దేశాల నేతల సమావేశం..

అయితే, ప్రతీసారి రష్యాకు మద్దతుగా నిలిచిన ఇండియా ఈ సారి షాకిచ్చింది. రష్యా డిమాండ్ ను తిరస్కరించిన 107 దేశాల్లో ఇండియా కూడా ఒకటి. అదేవిధంగా అల్బానియా తీర్మానం స్వీకరించే అంశాన్ని ఐరాస సర్వసభ్య సమావేశం పున: పరిశీలించాలని రష్యా కోరింది. దీనికి ఐరాస సర్వసభ్య సమావేశం పున: పరిశీలనకు నిరాకరించింది. ఇందుకోసం నిర్వహించిన ఓటింగ్ లో భారత్ సహా 104 దేశాలు ఐరాస సర్వసభ్య సమావేశం నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేశాయి. 16 దేశాలు రష్యాకు అనుకూలంగా ఓటు వేశాయి. మరో 34 దేశాలు గైర్హాజరయ్యాయి.

రష్యా శాశ్వత ప్రతినిధి వాసిల్లీ నెబెన్జియా ఐరాస సర్వసభ్య సమావేశం తీరుపై తీవ్రస్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఐరాస సభ్యత్వం భారీ మోసానికి చిహ్నంగా మారిందని అన్నారు. సభ్యదేశాలు స్వేచ్ఛగా అభిప్రాయాలను చెప్పే హక్కును దోచుకున్నారని విమర్శించారు. ఇదిలాఉంటే ఇప్పటి వరకు భారత్ రష్యా చర్యలను విమర్శిస్తూ ఎటువంటి ప్రకటన చేయలేదు.