Russia vs Ukraine War: తీవ్రరూపం దాల్చుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధం.. మేమున్నామంటూ జెలెన్‌స్కీకి జో బైడెన్ హామీ.. నేడు జీ7 దేశాల నేతల సమావేశం..

యుక్రెయిన్ పై రష్యా సైన్యం దాడులను తీవ్రతరం చేసింది. రష్యాను క్రిమియాకు కలిపే వంతెనపై పెద్ద పేలుడు సంభవించిన రెండు రోజుల తర్వాత రష్యా తమపై 84 క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని యుక్రెయిన్ సైన్యం తెలిపింది. రష్యా జరిపిన భారీ ప్రతీకార దాడుల్లో 14 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.

Russia vs Ukraine War: తీవ్రరూపం దాల్చుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధం.. మేమున్నామంటూ జెలెన్‌స్కీకి జో బైడెన్ హామీ.. నేడు జీ7 దేశాల నేతల సమావేశం..

Russia vs Ukraine War

Russia vs Ukraine War: యుక్రెయిన్ పై రష్యా సైన్యం దాడులను తీవ్రతరం చేసింది. రష్యాను క్రిమియాకు కలిపే వంతెనపై పెద్ద పేలుడు సంభవించిన రెండు రోజుల తర్వాత రష్యా తమపై 84 క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని యుక్రెయిన్ సైన్యం తెలిపింది. రష్యా జరిపిన భారీ ప్రతీకార దాడుల్లో 14 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారని యుక్రెయిన్ పేర్కొంది. రష్యాను క్రిమియాకు కలిపే వంతెనపై పేలుడు తరువాత రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. యుక్రెయిన్, దానికి సహకరిస్తున్న వారే ఈ పేలుడుకు కారణమని భావిస్తున్న పుతిన్.. యుక్రెయిన్ పై దాడుల తీవ్రతను పెంచారు. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్ర రూపందాల్చింది.

Russia vs Ukraine War: ప్రతీకారం తీర్చుకుంటున్న రష్యా.. పేలుళ్లతో దద్దరిల్లిన యుక్రెయిన్ రాజధాని కీవ్ సహా అనే నగరాలు.. వీడియోలు వైరల్

రష్యా తీరుపై యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. సాయుధ దళాలను బలోపేతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సోమవారం అర్థరాత్రి ప్రసంగంలో జెలెన్ స్కీ మాట్లాడుతూ..“మా సాయుధ బలగాలను బలోపేతం చేయడానికి మేము ప్రతిదీ చేస్తామని, తద్వారా రష్యాకు గుణపాఠం చెబుతామని అన్నారు. సోమవారం అనేక రష్యన్ క్షిపణులు యుక్రెయిన్ అంతటా లక్ష్యాలను చేధించాయి. పశ్చిమ యుక్రెయిన్‌లోని కీవ్, ఎల్వివ్, టెర్నోపిల్, జైటోమిర్, మధ్యలో డ్నిప్రో, క్రెమెన్‌చుక్, దక్షిణాన జాపోరిజ్జియా, తూర్పున ఖార్కివ్‌లలో పేలుళ్లు సంభవించినట్లు యుక్రెయిన్ అధికారులు తెలిపారు.

Russia-ukraine war Crimea Bridge : క్రిమియా బ్రిడ్జ్‌ని డ్రోన్‌తో పేల్చేశారా? .. బ్రిడ్జ్ కింద కనిపించిన మానవరహిత బోట్‌పై పలు అనుమానాలు

తొలినుంచి యుక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్న అమెరికా రష్యా తీరును తప్పుబట్టింది. సోమవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మాట్లాడారు. వైట్ హౌస్ తెలిపిన వివరాల ప్రకారం.. జెలెన్ స్కీతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడాడని పేర్కొంది. కీవ్‌తో సహా యుక్రెయిన్ అంతటా రష్యా క్షిపణి దాడులను ఆయన ఖండించారు. ఈ దాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు జోబైడెన్ తన సంతాపాన్ని తెలియజేశారు. అయితే, రష్యా దాడులను తిప్పికొట్టేందుకు అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థలతో సహా, తనను తాను రక్షించుకోవడానికి అవసరమైన ఆయుదాలను యుక్రెయిన్‌కు అందిస్తామని జోబైడెన్ యుక్రెయిన్ అధ్యక్షుడికి హామీ ఇచ్చారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇతర గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) నాయకులు యుక్రెయిన్‌కు మద్దతు ఇవ్వడానికి, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు గట్టి జవాబు ఇచ్చేందుకు మంగళవారం వర్చువల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ ధృవీకరించింది. వైట్ హౌస్ వివరాల ప్రకారం.. జెలెన్ స్కీ G7 దేశాల నాయకులతో కలిసి మంగళవారం సమావేశంలో పాల్గొంటారని తెలిపింది.