Daleep Singh : రష్యాపై అమెరికా ఆంక్షల వ్యవహారంలో భారతీయ అమెరికన్ కీలక పాత్ర..!

రష్యా, యుక్రెయిన్ సంక్షోభం కొనసాగుతున్న వేళ.. యుక్రెయిన్‌పై దాడికి అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం తీసుకోవడంపై అమెరికా సహా ఇతర మిత్రదేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

Daleep Singh : రష్యాపై అమెరికా ఆంక్షల వ్యవహారంలో భారతీయ అమెరికన్ కీలక పాత్ర..!

Daleep Singh Indian American Leads Biden Administration In Executing Russia Sanctions

Updated On : February 23, 2022 / 6:12 PM IST

Indian-American Daleep Singh : రష్యా, యుక్రెయిన్ సంక్షోభం కొనసాగుతున్న వేళ.. యుక్రెయిన్‌పై దాడికి అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం తీసుకోవడంపై అమెరికా సహా ఇతర మిత్రదేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యాపై అమెరికా ఆర్థిక ఆంక్షలను విధించింది. రష్యా పాలనా విధానానికి సంబంధించి వ్యవహారంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ ఆంక్షల వ్యహారంలో భారతీయ-అమెరికన్ ఆర్థిక సలహాదారు దలీప్ సింగ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బైడెన్ ప్రభుత్వంలో 47ఏళ్ల దలీప్ సింగ్ రష్యాపై ఆంక్షలను అమలు చేయడంలో నాయకత్వం వహిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే యుక్రెయిన్ లోని డొనెట్స్క్, లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలను గుర్తిస్తూ డిక్రీలపై సంతకం చేశారు. పుతిన్ నిర్ణయంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది.

యుక్రెయిన్‌పై మాస్కో ఏ క్షణమైనా దాడి చేస్తుందనే భయాందోళనలు నెలకొన్నాయి. క్రెమ్లిన్ మాస్కో-మద్దతు ఉన్న ప్రాంతాలలో శాంతి పరిరక్షక మిషన్‌గా పిలిచే రష్యన్ దళాలను తూర్పు ఉక్రెయిన్‌లోకి మోహరించాడు. ఈ క్రమంలోనే రష్యా చర్యలపై అమెరికా ఆర్థిక ఆంక్షలను విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలోనే వైట్ హౌస్‌లో అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రానికి డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్ అయిన భారతీయ అమెరికన్ దలీప్ సింగ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆంక్షల వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తూ కొద్ది రోజుల వ్యవధిలో దలీప్ సింగ్.. వైట్ హౌస్ మీడియా సమావేశంలో రెండుసార్లు హైలట్ అయ్యారు. రష్యా పాలనా విధానంలో దలీప్ సింగ్ కీలక పాత్ర పోషిస్తున్నారని, అందుకే తాను కీలక బాధ్యతలు చేపట్టాల్సిన వచ్చిందంటూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ ఆ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. అంతే.. రష్యా ఆంక్షల వ్యవహారంలో దలీప్‌ సింగ్‌ ప్రాధాన్యం ఎంతవరకు ఉందో అర్థమవుతోంది.

Daleep Singh Indian American Leads Biden Administration In Executing Russia Sanctions (2)

Daleep Singh Indian American Leads Biden Administration In Executing Russia Sanctions 

ఈ సందర్భంగా సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. యుక్రెయిన్‌పై రష్యా దీర్ఘకాలంగా సమీక్షించిన తర్వాతే దండయాత్ర ప్రారంభమైందన్నారు. దీనిపై అమెరికా ప్రతిస్పందన కూడా ఉందన్నారు. అధ్యక్షుడు (జో బిడెన్) వేగంగా స్పందించారని చెప్పారు. దాంతో జర్మనీతో రాత్రికి రాత్రే సంప్రదింపులు జరిపామని, పైప్‌లైన్‌ల ఆపరేషన్లను నిలిపివేయించామని తెలిపారు. ఆ తర్వాతే ఆర్థిక ఆంక్షలను విధించినట్టు వెల్లడించారు. బిలియన్ల డాలర్లు విలువైన ఆస్తుల్ని, ఆర్థిక లావాదేవీలను ఆపివేసినట్టు వెల్లడించారు.

ఈ నిర్ణయంతో అమెరికా, యూరప్‌ దేశాలతో ఎలాంటి లావాదేవీలు ఉండబోవని సింగ్ స్పష్టం చేశారు. కొత్త అప్పులు కూడా ఇచ్చేది లేదన్నారు. రష్యాకు చెందిన ధనిక కుటుంబాలపై అదనపు చర్యలూ ఉంటాయని, ఇవేం పొరపాటుగా తీసుకున్న నిర్ణయాలు కావన్నారు. పరస్సర సహకారంతోనే ముందుకు వెళ్తున్నట్టుగా చెప్పారు. ఈరోజు మేం తీసుకున్న చర్యలు మొదటి విడత మాత్రమేనన్నారు. ఇంకా చాలా ఉన్నాయని, పుతిన్ మరింత మొండిగా వ్యవహరిస్తే.. ఆర్థిక ఆంక్షల్ని, ఎగుమతి నియంత్రణలతో మరింత ఒత్తిడి పెంచుతామని తెలిపారు. మిత్రదేశాల సహకారంతో పూర్తిస్థాయిలో ఆంక్షల్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని దలీప్‌ సింగ్‌ తెలిపారు. ఇది దండయాత్రకు నాంది అని, అమెరికా ప్రతిస్పందనకు నాంది అని సింగ్ అన్నారు.

దలీప్‌ సింగ్‌ పుట్టింది మేరీల్యాండ్‌ ఓల్నీ.. ఆయన పెరిగింది మాత్రం నార్త్‌ కరోలినా రాలేయిగ్‌లో.. అలాగే కాంగ్రెస్ అమెరికా చట్ట సభకు ఎంపికైన తొలి ఏషియన్‌ అమెరికన్‌ దలీప్‌ సింగ్‌ సౌంధుకి బంధువు కూడా. ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ చేసిన దలీప్‌, పలు ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యలను పూర్తి చేశాడు. ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌కి వైస్‌ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. అలాగే ఒబామా హయాంలోనూ పలు కీలక బాధ్యతల్లో వ్యవహారించారు.

Read Also : Russia-Ukraine Crisis : తగ్గేదేలే అంటున్న యుక్రెయిన్.. ఎమర్జెన్సీ విధిస్తూ సంచలన నిర్ణయం