భారత ఆర్మీ చీతా హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైంది. భూటాన్‌కు సమీపంలో పొగమంచు కారణంగా శుక్రవారం మధ్యాహ్నం నేలకొరిగింది. భూటాన్‌లోని యోన్పులా లోకల్ ఎయిర్ పోర్టుకు చేరువలో భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకుంటుండగా ప్రమాదం జరిగింది.
‘ఇండియన్ ఆర్మీ హెలాకాఫ్టర్ భూటాన్‌లోని యోన్పులా ప్రాంతంలో కూలిపోయింది. ఆ తర్వాత రేడియో సిగ్నల్స్, విజువల్ కాంటాక్ట్‌ను అందుకోలేకపోయింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఖిర్ము ప్రాంతం నుంచి యోన్పులా ప్రాంతానికి డ్యూటీ మీద వస్తుండగా పొగ మంచు ఎక్కువవడంతో ప్రమాదం సంభవించింది’ అని ఆర్మీ అధికారి కల్నల్ అమన్ ఆనంద్ తెలిపారు.
ఈ ప్రమాదంలో పైలట్లతో పాటు, రాయల్ భూటాన్ ఆర్మీకి చెందిన కెప్టెన్, లెఫ్టినెంట్ కల్నల్, ఆర్మీ ఏవీయేషన్ కార్ప్స్ కూడా ఉన్నారు. ప్రమాదానికి గురైన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టి గాయాలపడిన వారిని రక్షించగలిగారు. భారత ఎయిర్ ఫోర్స్ సైతం రంగంలోకి దిగి ఆర్మీ హెలికాఫ్టర్లతో సహాయక చర్యలు చేపట్టింది.