పాకిస్తాన్ ప్రత్యేక దళాలపై ఎదురుదాడి చేసిన భారత్ వారిని మట్టుబెట్టింది. మంగళవారం జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఘటన జరిగింది. పూంచ్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్‌ను పాక్ ప్రత్యేక దళాలు దాటే ప్రయత్నం చేశాయి. ఇరు దళాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక భారత సైనికుడి ప్రాణాలు కోల్పోగా పాక్ ఆర్మీలోని ఇద్దరి కమాండోలను మట్టుబెట్టారు.
ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరు వైపుల నుంచి రాకెట్ లాంచర్స్‌తో, ట్యాంక్ మిస్సైల్స్‌తో దాడులు జరిగాయి. ఇండియన్ ఆర్మీ రైఫిల్ మాన్ సుఖ్‌విందర్ సింగ్ బుల్లెట్ గాయానికి గురయ్యాడు. గాయంతో బాధపడుతూ అక్కడికక్కడే మరణించాడు.
భారత్ జరిపిన ఎదురుదాడులలో పాకిస్తాన్ సైన్యంలో కనీసం ఇద్దరు చనిపోయినట్లుగా అక్కడి వర్గాలు వెల్లడించాయి. సుందర్‌బెనీ సెక్టార్‌లో పాకిస్తాన్ ఆర్మీ మూడు వైలపు నుంచి దాడి జరిపింది. పాకిస్తాన్ జరిపిన నియమాల ఉల్లంఘనలో ఇదొకటి. దాడి అనంతరం పూంచ్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించింది భారత ఆర్మీ.