Traditional Indian Bed: US ఆన్ లైన్ షాపింగ్ సైట్‌లో రూ.లక్ష ధర పలుకుతున్న ఇండియన్ బెడ్.. దాని ప్రత్యేకత ఏంటంటే?

మన భారతీయ సంప్రదాయ మంచం అమెరికన్ ఈ కామర్స్ వెబ్ సైట్‌లో అక్షరాల లక్ష రూపాయల ధర పలుకుతోంది. ఇంతకీ ఈ బెడ్‌కి అంత ధర ఎందుకో తెలుసా?

Traditional Indian Bed cost Rs 1 Lakh : ఆ మంచం ఖరీదు అక్షరాల లక్ష రూపాయలు. అమెరికన్ ఆన్‌లైన్ షాపింగ్ సైట్ Etsy.com లో దీనిని విక్రయిస్తున్నారు. అంత ఖరీదు పలకడానికి దీని ప్రత్యేకత ఏమిటి? అంటే..

1.6 lakh pizza for a client : ఓ చెఫ్ తన క్లయింట్ కోసం తయారు చేసిన పిజ్జా ఖరీదు అక్షరాల 1.63 లక్షలు..

చెక్క మరియు చేతితో నేసిన తాడుతో తయారు చేసిన ఇండియన్ మేడ్ మంచం ఇప్పుడు కొనడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. USలోని ఇ-కామర్స్ వెబ్‌సైట్ దీనిని అమ్మడానికి లక్ష రూపాయల ధర నిర్ణయించింది.

ఈ మంచం ప్రత్యేకంగా అలంకరణ కోసం కూడా వాడుకోవచ్చు. గదిలో లేదా ఆరు బయట ఇది చక్కగా అమరిపోతుంది. 36 అంగుళాల వెడల్పు, 72 అంగుళాల పొడవు 18 అంగుళాల ఎత్తు ఉన్న పంజాబీ స్టైల్ బెడ్‌ని “ఖాట్” లేదా “మంజి” అని కూడా పిలుస్తారట. ఈ మంచం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

World Bigest Bed : ఆమాత్రం ఉండాల్లే..!ఆరుగురు భార్యల కోసం 20 అడుగుల మంచం .. దాని ధర తెలిస్తే షాకే

అయితే దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయట. పెద్దగా నాణ్యత లేదని .. ఆర్డర్ చేరడానికి మూడు నెలల టైం కూడా పడుతుందని రివ్యూలు వచ్చాయట. ఏది ఏమైనా కొన్ని వస్తువులు ఈ ఫ్యాషన్ వరల్డ్ లో తమదైన స్ధానాన్ని సంపాదించుకుంటాయి. ఈ మంచం కూడా అంతే.

 

ట్రెండింగ్ వార్తలు