World Bigest Bed : ఆమాత్రం ఉండాల్లే..!ఆరుగురు భార్యల కోసం 20 అడుగుల మంచం .. దాని ధర తెలిస్తే షాకే

అతను 20 అడుగుల మంచం చేయించుకున్నాడు. ఎందుకంటే ఆరుగురు భార్యలతో కలిసి ఉండాలంటే ఆమాత్రం ఉండాలిగా అంటున్నాడు.

World Bigest Bed : ఆమాత్రం ఉండాల్లే..!ఆరుగురు భార్యల కోసం 20 అడుగుల మంచం .. దాని ధర తెలిస్తే షాకే

Brazil Man Six Wives 20 Feets bed

World Bigest bed : ఎవరైనా సింగిల్ కాట్ (Single Cot)లేదా డబుల్ కాట్ (Double cot) చేయించుకుంటారు. ఇద్దరు లేదా ముగ్గురు కంఫర్ట్ గా పడుకోవాలంటే డబుల్ కాట్ ఉండాల్సిందే. కానీ ఓ వ్యక్తి మాత్రం మాత్రం ఏకంగా 20 అడుగుల మంచం చేయించాడు. బహుశా ఇదే ప్రపంచంలోనే అతి పెద్ద మంచం కావచ్చు. మరీ 20అడుగుల మంచమా? అని ఆశ్చర్యపోతున్నారా? మరి అతగాడికి ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు భార్యలున్నారు మరి. వారంతా వేరే వేరే రూముల్లో పడుకోరట..అందరు కలిసి ఒకే రూమ్ లో ఒకే మంచంమీద పడుకుంటారట..అందుకనే ఈ భారీ మంచం. ఇక్కడ మంచం ఓ ప్రత్యేకత అయితే ఆరుగురు భార్యలతో కలిసి పడుకోవాలంటే ఈ ‘మాత్రం మంచం’ కావాలంటున్నాడీ భర్త..

ఆ ఆరుగురు భార్యలు కలిసి మెలిసి ఉంటారట.. కలిసి తినటం నుంచి కలిసి పడుకునేంత కలిసిమెలిసి ఉంటారట. ఎవరితో భర్త వేరుగా పడుకున్నా మిగిలినవారు అలుగుతారట. అందుకనే ఈ సెటప్ అన్నమాట..అదేనండీ 20 అడుగుల వెడల్పుకలిగిన మంచం..భార్యల్ని బాధపెట్టటం ఇష్టంలేని ఆ భర్త కత్తిలాంటి ఐడియాకు ప్రతిరూపంగా 20 అడుగుల మంచం ఏర్పాటైంది. మంచం భారీది కదా..మరి దీని ధర కూడా ఆ రేంజ్ లోనే ఉందండోయ్..

భర్తతో కలిసి ఆరుగురు భార్యలు అంటూ మొత్తం ఏడుగురు కలిసి పడుకునే ఆ మంచం తయారీకి ఏకంగా రూ.81 లక్షలు చెల్లించి తయారు చేయించుకున్నాడీ భర్తగారు. ఏంటీ ఆ ధర పెడితే నగరాల్లో ఏకంగా డబుల్ బెడ్రూమేంటీ ఏకంగా ట్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు కదూ..నిజమే మరి కానీ ప్లాంట్ కంటే ఆరుగురు భార్యలతో కలిసి ఒకే మంచం మీద పడుకుంటే ఈ కిక్కే వేరప్పా అంటన్నాడీ భర్త..మరి మంచం గురించి..ఆరుగురు భార్యలతో కలిసి హాయిగా నిద్రించటానికి ఇంత కత్తిలాంటి ఐడియా వేసిన ఆ భర్తగారి గురించి కూడా తెలుసుకోవాలిగా..ఇంతకీ ఐ భర్త ఎక్కడున్నాడో తెలుసుకుందాం.

అతని పేరు ఆర్థర్ ఓ ఉర్సో. బ్రెజిల్ దేశానికి చెందినవాడు. అతనికి ఆరుగురు భార్యలున్నాయి. అందరు కలిసి మెలిసి ఉంటారు. ఎంతో ఆదర్శంగా ఉంటారట..సొంత అక్కాచెల్లెళ్లైకా గొడవలు పడతారేమో గానీ వీరు మాత్రం అస్సలు గొడవే పడరట. ఇంత బాగా కలిసి ఉండే ఈ ఆరుగురు భార్యలు ఒకే ఒక్క విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కారట.. ఆర్థర్ ఎవరో ఒకరితో కలిసి పడుకుంటే మిగిలిన ఐదుగురు అలిగేవారట..దీంతో ఆర్థర్ అందరితో కలిసి మొత్తం ఏడుగురు ఒకేరూమ్ లో పడుకునేవారట..అదే సయమంలో వారికి వచ్చిన సమస్య ‘మంచం’..డబుల్ కాట్ కాదు లార్జ్ సైజ్ మంచం కూడా ఏడుగురికి సరిపోక అతడే చాలాసార్లు సోఫాలో లేదా నేలపై పడుకోవల్సి వచ్చేదట. దీంతో ఆర్థర్ కు అందరికీ కలిపి ఒక బెడ్ ఉండాలనే ఆలోచన వచ్చిందట. అంతా తలోదిక్కు నిద్రపోడానికి బదులు.. ఒకే చోట నిద్రపోతే ఎంతో హాయిగా ఉంటుందని భావించి.. ఒక పెద్ద మంచాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడట. ఆ ఆలోచనలకు రూపమే ఈ 20 అడుగుల బెడ్…అదన్నమాట ఆరుగురు భార్యలకు ఆమాత్రం మంచం ఉండాలనే ఆలోచన..

కాగా ఈ మంచానికి తయారీకి 12మంది కష్టపడితే 15 నెలలు పట్టిందట. భారీ మంచం పైగా భారీ బరువును కూడా మోయాలిగా అందుకే ఈ మంచానికి 950 స్క్కూలు బిగించారట. 20 అడుగుల వెడల్పు,7 అడుగుల పొడుగు గల ఈ మంచం తయారీకి బ్రిజిల్ కరెన్సీలో 80,000 ఖర్చు కాగా భారత కరెన్సీలో రూ.81 లక్షలు పైనే..