PM Narendra Modi : అమెరికాలో ఎన్నికల వేళ ప్రధాని మోదీ పర్యటన.. ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు

PM Narendra Modi : ఫిలడెల్ఫియాలోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారతీయ అభిమానులు పెద్ద సంఖ్యలో ఫిలడెల్ఫియా అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలివచ్చారు.

PM Narendra Modi : అమెరికాలో ఎన్నికల వేళ ప్రధాని మోదీ పర్యటన.. ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు

Updated On : September 21, 2024 / 11:58 PM IST

PM Narendra Modi : అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అమెరికా చేరుకున్నారు. ఫిలడెల్ఫియాలోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారతీయ అభిమానులు పెద్ద సంఖ్యలో ఫిలడెల్ఫియా అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలివచ్చారు. మోదీతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహాన్ని కనబరిచారు.

Read Also : PM Modi : అమెరికా పర్యటనకు వెళ్లిన నరేంద్ర మోదీ.. ప్రధాని హోదాలో అమెరికా ఎన్నిసార్లు వెళ్లారో తెలుసా?

స్థానిక భారతీయులతో కాసేపు మోదీ ముచ్చటించారు. ప్రవాస భారతీయులకు మోదీ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. వారి బహుమతులను కూడా మోదీ స్వీకరించారు. ఫిలడెల్పియా చేరుకున్న మోదీకి అక్కడి అధికారులు కూడా ఘన స్వాగతం పలికారు. డెలావేర్‌లో ప్రధాని మోదీ బస చేయనున్న హోటల్ వద్ద కూడా వందలాది మంది గుమిగూడారు. అమెరికాలో క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారు. ఐరాస సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.

దేశాధ్యక్షుడు బైడెన్, ఆస్ట్రేలియన్ పీఎం ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిడా ఫుమియోతో సహా క్వాడ్ గ్రూపింగ్ ఇతర నాయకులతో ప్రధాన మంత్రి ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ తర్వాత కొన్ని కీలక ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్-సంబంధిత ఒప్పందాలు, భారత్-యుఎస్ డ్రగ్ ఫ్రేమ్‌వర్క్ సంబంధిత ఎమ్ఒయుపై సంతకాలు జరుగుతాయని భావిస్తున్నారు. ఇరువురు నేతల మధ్య ద్వైపాక్షిక చర్చల అనంతరం ద్వైపాక్షిక ఫ్యాక్ట్ షీట్ కూడా విడుదల కానుంది.

విల్మింగ్టన్ నుంచి ప్రధాని మోదీ న్యూయార్క్‌కు చేరుకోనున్నారు. న్యూయార్క్‌లో ఆదివారం (సెప్టెంబర్ 22) జరిగే ప్రవాస భారతీయుల సదస్సులో మోదీ పాల్గొంటారు. దాదాపు 14 వేల మంది ప్రవాస భారతీయులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. సోమవారం (సెప్టెంబర్ 23), యూఎన్ జనరల్ అసెంబ్లీలో సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్‌లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

“ఫిలడెల్ఫియాలో అడుగుపెట్టాను. నేటి కార్యక్రమం క్వాడ్ సమ్మిట్, అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్‌తో ద్వైపాక్షిక సమావేశం. రోజంతా జరిగే చర్చలు కీలకమైన ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి దోహదం చేస్తాయని నేను కచ్చితంగా అనుకుంటున్నాను” అని ప్రధాని మోదీ పోస్ట్ చేశారు.

Read Also : శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదం వేళ.. పవన్ కల్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష