దుబాయ్ లో భారతీయుడి నిజాయితీ, పోలీసుల ప్రశంసలు

Indian In UAE : దుబాయ్ లో నివాసం ఉంటున్న భారతీయుడి నిజాయితీకి మెచ్చి…సత్కరించారు అక్కడి పోలీసులు. విలువైన వస్తువులున్న బ్యాగును ఇచ్చినందుకు అవార్డు ఇచ్చారు. దుబాయి్ లో రేతేష్ జేమ్స్ గుప్తా నివాసం ఉంటున్నారు.
ఇతను ఓ బ్యాగ్ తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి అప్పగించారు. బ్యాగు ఓపెన్ చేసి చూడగా..USD 14,000, బంగారం ఉందని పోలీసులు వెల్లడించారు. అతని నిజాయితీని మెచ్చుకున్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించారని ప్రశంసించారు. అతనికి ప్రశంసలతో కూడిన పత్రాన్ని అందచేశారని గల్ఫ్ న్యూస్ వెల్లడించింది.
బంగారం విలువ 200, 000 dirhams (USD 54,452) ఉంటుందని అంచనా. Director of Al Qusais Police Station Brigadier Yousef Abdullah Salim Al Adidi రేతేష్ ను మెచ్చుకున్నారు. అయితే..బ్యాగు ఎవరిదన్నది తెలియరాలేదని తెలిపారు. తనను ప్రశంసించినందుకు గుప్తా కృతజ్ఞతలు తెలిపారు.