Indian Journalist: న్యూయార్క్‌లో ఈ-బైక్ బ్యాటరీ పేలి అగ్నిప్రమాదం.. భారతీయ జర్నలిస్టు మృతి

ఫాజిల్ ఖాన్ మృతదేహాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు అన్నివిధాల సహాయసహకారాలు అందిస్తామని భారతీయ రాయబార కార్యాలయం తెలిపింది.

Fire accident in New York city

New York Fire Accident : అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 27ఏళ్ల భారతీయ జర్నలిస్ట్ మృత్యువాత పడ్డాడు. ఎలక్ట్రిక్  బైకులోని లిథియం – అయాన్ బ్యాటరీ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో న్యూయార్క్ లోని హార్లెమ్ లోని ఓ అపార్ట్ మెంట్ భవనంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని భారతీయ జర్నలిస్టు మృతిచెందాడు. కొందరు ప్రాణాలు రక్షించుకునేందుకు కిటికీల్లో నుంచి దూకూరు. ఈ క్రమంలో 17మందికి తీవ్ర గాయాలైనట్లు, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అమెరికన్ మీడియా పేర్కొంది.

Also Read : లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మంటల్లో చిక్కుకొని మరణించిన భారతీయ జర్నలిస్టును ఫాజిల్ ఖాన్ (27)గా గుర్తించారు. మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు భారత రాయబార కార్యాలయం ప్రయత్నిస్తోంది. దేశంలోని ప్రముఖ మీడియా సంస్థల్లో కాపీ ఎడిటర్ గా ఫాజిల్ ఖాన్ పనిచేశాడు. జర్నలిజంలో డిగ్రీ పూర్తిచేసేందుకు 2020లో న్యూయార్క్ వెళ్లిన అతను.. అక్కడి కొలంబియా జర్నలిజం స్కూల్ లో కోర్సును పూర్తి చేశాడు. అప్పటి నుంచి అక్కడే నివాసం ఉంటున్నాడు.

ఫాజిల్ మృతిపట్ల భారత రాయబార కార్యాలయం విచారణం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబం, స్నేహితులకు టచ్ లో ఉంటున్నామని, మృతదేహాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు అన్నివిధాల సహాయసహకారాలు అందిస్తామని రాయబార కార్యాలయం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించింది.

Also Read : Vanitha Vijaykumar : నా తండ్రి మాటలు వినడం వల్లే నా జీవితం నాశనం అయింది

 

 

ట్రెండింగ్ వార్తలు