Vanitha Vijaykumar : నా తండ్రి మాటలు వినడం వల్లే నా జీవితం నాశనం అయింది

ప్రముఖ నటుడు విజయ్‌కుమార్ కుమార్తె వనిత సినిమాల కంటే వివాదాలతోనే వార్తల్లో ఉంటారు. రీసెంట్‌గా వనిత అక్క కూతురి వివాహానికి ఆహ్వానం అందకపోవడంతో చాలా అప్ సెట్ అయినట్లు తెలుస్తోంది.

Vanitha Vijaykumar : నా తండ్రి మాటలు వినడం వల్లే నా జీవితం నాశనం అయింది

Vanitha Vijaykumar

Vanitha Vijaykumar : నటి వనితా విజయ్‌కుమార్ సినిమాల కంటే వివాదాలతోనే వార్తల్లో ఉంటారు. వరుస పెళ్లిళ్లు వివాదాల కారణంగా కుటుంబ సభ్యులు కూడా ఆమెను పూర్తిగా దూరం పెట్టారు. రీసెంట్‌గా ప్రముఖ నటుడు, వనిత తండ్రి విజయ్ కుమార్ మనవరాలు దియా పెళ్లికి కూడా ఆమెకు ఆహ్వానం అందలేదు. దీనిపై వనిత ఇన్‌స్టా స్టోరీలో స్పందించారు.

Game Changer : ‘గేమ్ ఛేంజర్’లో రామ్‌చరణ్ నుంచి ఆర్ఆర్ఆర్‌కి మించిన వేరియేషన్స్ చూస్తారు..

వనిత దళపతి విజయ్‌కి జోడీగా ‘చంద్రలేఖ’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాలు పక్కన పెడితే వ్యక్తిగత విషయాలతో ఆమె ఎక్కువగా వార్తల్లో నిలిచారు. కెరియర్‌లో సెటిల్ అవుతున్న టైమ్‌లో నటుడు ఆకాష్‌ని పెళ్లాడి ఏడాదికే విడాకులు ఇచ్చి ఆనంద్ అనే బిజినెస్ మ్యాన్‌ని పెళ్లి చేసుకున్నారు వనిత. అతని నుండి విడిపోయి పీటర్ పాల్ అనే వ్యక్తిని పెళ్లాడి అతడిని దూరం పెట్టేశారు. పీటర్ పాల్ గతేడాది చనిపోయిన సమయంలో అతను తన భర్త కాదని.. మాకు పెళ్లే జరగలేదని చెప్పి అందర్నీ షాక్ కి గురి చేసారు. బిగ్ బాస్ షోలో పాపులారిటీ సంపాదించిన విజయ్‌‌కుమార్ తన కూతురు వనిత నుండి విడిపోయారు.

పెళ్లి వివాదాలతో పాటు కుటుంబ వివాదాల కారణంగా వనితను విజయ్‌కుమార్ కుటుంబం దూరం పెట్టింది. అసలు వనితను పట్టించుకోవడమే మానేశారు. రీసెంట్‌గా విజయ్‌కుమార్ మనవరాలు దియా వివాహం దిల్లాన్ మిస్త్రీతో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో విజయ్‌కుమార్ ఇద్దరు భార్యల పిల్లలు సందడి చేశారు. ఈ వేడుకకు వనితకు ఆహ్వానం అందలేదు. దియా వివాహానికి ఆహ్వానం అందకపోవడంపై వనిత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక చోట గుమిగూడిన గుంపు మధ్య సింహం ఒంటరిగా నడుస్తున్నట్లు వీడియోను పోస్ట్ చేసారు.

Nani32 : నాని, సుజిత్ అనౌన్స్‌మెంట్ వీడియో వచ్చేసింది.. రజినీకాంత్ ‘బాషా’ రేంజ్‌లో..

గతంలో వనితా విజయ్‌కుమార్ తన తండ్రి గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒక ఇంటర్వ్యూలో విజయ్‌కుమార్ తన పిల్లలు అందరి పేర్లు చెప్పి తన పేరు మాత్రం చెప్పలేదని .. ఆయన చెప్పకపోయినా ఈ ప్రపంచానికి నేను ఆయన కూతురు అని తెలుసునని వనిత అన్నారు. నా తండ్రి మాటలు వినడం వల్లే నా జీవితం నాశనం అయింది అంటూ మాట్లాడారు. మొత్తానికి వనిత విజయ్ కుమార్ మళ్లీ ఇలా వార్తల్లో నిలిచారు.

 

View this post on Instagram

 

A post shared by Diya (@diya.diaries)