లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

లాస్య నందిత కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.

లాస్య నందిత కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

BRS Working President KTR

BRS MLA Lasya Nanditha Death : కంటోన్మెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. లాస్య నందిత కుటుంబాన్ని ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. లాస్య నందిత చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ప్రమాదంకు గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Also Read : లాస్య నందితను వెంటాడిన వరుస ప్రమాదాలు.. తండ్రి చనిపోయిన ఫిబ్రవరి నెలలోనే కూతురూ మృతి

లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలుసుకొని విస్మయానికి గురైనట్లు కేటీఆర్ చెప్పారు. నేను విదేశాల్లో ఉండటం వల్ల రాలేక పోయానని అన్నారు. లాస్య నందితను గత పదిరోజులుగా అనేక ప్రమాదాల వెంటాడాయని, గతేడాది సాయన్న చనిపోవటం, ఇప్పుడు లాస్య నందిత మృతితో కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ శ్రేణుల్లో తీరనిశోకాన్ని నింపిందన్నారు. ఆమె కుటుంబానికి అన్నివిధాల అండగా ఉంటామని, వారి కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు కేటీఆర్ చెప్పారు.

Also Read : Lasya Nandita: లాస్య నందిత పోస్ట్‌మార్టం నివేదిక.. తలకు బలమైన గాయంతో పాటు..