దీపావళి టపాసులు పేల్చాడు.. జైల్లో పెట్టారు

దీపావళి పండుగ రోజున టపాసులు పేల్చాడు. అంతే.. మూడు వారాలు జైల్లో పెట్టారు.. 5వేల డాలర్లు జరిమానా కూడా విధించారు. టపాసులు పేలిస్తే.. జైల్లో పెట్టడమేంటీ అనుకుంటున్నారా?

  • Published By: sreehari ,Published On : April 12, 2019 / 11:47 AM IST
దీపావళి టపాసులు పేల్చాడు.. జైల్లో పెట్టారు

దీపావళి పండుగ రోజున టపాసులు పేల్చాడు. అంతే.. మూడు వారాలు జైల్లో పెట్టారు.. 5వేల డాలర్లు జరిమానా కూడా విధించారు. టపాసులు పేలిస్తే.. జైల్లో పెట్టడమేంటీ అనుకుంటున్నారా?

దీపావళి పండుగ రోజున టపాసులు పేల్చాడు. అంతే.. మూడు వారాలు జైల్లో పెట్టారు.. 5వేల డాలర్లు జరిమానా కూడా విధించారు. టపాసులు పేలిస్తే.. జైల్లో పెట్టడమేంటీ అనుకుంటున్నారా? మీరే కాదు.. జైలు శిక్ష పడిన భారత సంతతి వ్యక్తి జీవన్ అర్జున్ (29) కూడా ఇలానే అనుకున్నాడు. జైలు శిక్ష పడింది ఇప్పుడేగానీ, టపాసులు పేల్చింది 2018 ఏడాదిలో దీపావళి వేడుకల్లో.. ఆ రోజు రాత్రి హౌస్ కాంప్లెక్స్ లో వారంతా టపాసులు పేల్చారు. అర్జున్ కూడా టపాసులు పేల్చాడు. అందరూ నిద్రపోయారు.
Read Also : చంద్రుడిపై కూలిన ఇజ్రాయెల్ అంతరిక్ష నౌక

అర్ధరాత్రి దాటాక 3 గంటల ప్రాంతంలో మళ్లీ లేచి హౌస్ కాంప్లెక్స్ లో టపాసులు పేల్చాడు. అంతే.. ఐదు నిమిషాల పాటు నాన్ స్టాప్ గా భారీ శబ్దంతో టపాసులు పేలాయి. అప్పటివరకూ హాయిగా నిద్రపోయిన కాంప్లెక్స్ వాసులంతా అగ్నిప్రమాదమా? లేదా ఉగ్రవాదుల బాంబు దాడి చేశారేమోనని భయంతో గట్టిగా కేకలు పెట్టారు.

కాంప్లెక్స్ నుంచి బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ.. పేలిన టపాసుల కారణంగా ప్రాణ నష్టంగానీ, ఆస్తి నష్టం జరుగలేదు. అసలు విషయం తెలిసిన కాంప్లెక్స్ వాసులంతా జీవన్ పై మండిపడ్డారు. వీరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు జీవన్ ను  అరెస్ట్ చేశారు.

విచారణ అనంతరం.. నిందితుడు జీవన్ ను కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుపై ఇటీవల కోర్టులో విచారణకు రాగా.. జిల్లా జడ్జీ మార్విన్ బే.. నిందితుడు అర్జున్ కు మూడు వారాల పాటు జైలు శిక్ష విధించారు. 5వేల సింగపూర్ డాలర్లు (3వేల 685 యూఎస్ డాలర్లు) చెల్లించాల్సిందిగా ఆదేశించారు.    
Read Also : అమ్మో.. బాంబు తుపాన్.. అమెరికా గజగజ