Tommy Genesis: తీవ్ర వివాదంలో కెనడా రాపర్ మ్యూజిక్ వీడియో.. భగ్గుమన్న హిందువులు, క్రైస్తవులు.. ఎందుకు.. ఎవరీ టామీ జెనెసిస్..

ఆమె కొత్త పాట హిందువులు, క్రైస్తవుల మత విశ్వాసాలను బహిరంగంగా అపహాస్యం చేస్తుంది.

Tommy Genesis: తీవ్ర వివాదంలో కెనడా రాపర్ మ్యూజిక్ వీడియో.. భగ్గుమన్న హిందువులు, క్రైస్తవులు.. ఎందుకు.. ఎవరీ టామీ జెనెసిస్..

Updated On : June 24, 2025 / 7:03 PM IST

Tommy Genesis: కెనడియన్ మోడల్, రాపర్ టామీ జెనెసిస్.. ‘ట్రూ బ్లూ’ అనే కొత్త మ్యూజిక్ వీడియో తీవ్ర వివాదాస్పదమైంది. ఇందులో ఆమె వస్త్రధారణపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హిందువులు, క్రైస్తవులు ఆమెపై భగ్గుమంటున్నారు. తమ మనోభావాలను దెబ్బతీశారని మండిపడుతున్నారు. అంతేకాదు ఆ మ్యూజిక్ వీడియోని రిపోర్ట్ చేయాలని పిలుపునిస్తున్నారు. భారత సంతతికి చెందిన కెనడియన్ రాపర్ టామీ జెనెసిస్ కొత్త మ్యూజిక్ వీడియో ‘ట్రూ బ్లూ’తో హిందూ, క్రైస్తవ మత విశ్వాసాలను దెబ్బతీశారని అంతా మండిపడుతున్నారు. కాళికా దేవతగా ఆమె కనిపించడాన్ని భక్తులు తప్పుపడుతున్నారు.

టామీ జెనెసిస్.. హిందూ దేవత కాళీమాత దుస్తులు ధరించినందుకు విమర్శల పాలైంది. నీలిరంగు బాడీ పెయింట్, ఎరుపు బిందీ, బంగారు ఆభరణాలలో అందులో కనిపిస్తుంది. అదే సమయంలో చాలామందికి “దైవదూషణ”గా అనిపించే విధంగా క్రైస్తవ శిలువను కూడా ఉంచుతుంది. జూన్ 20న ఆమె తన కొత్త పాట కోసం వీడియోను విడుదల చేసింది.

ఈ మ్యూజిక్ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. దీనిని చీప్ టాక్టిక్ గా అభివర్ణించారు. “ఆమె భారతీయ సంతతికి చెందిన వ్యక్తి కాబట్టి ఆమె మేకప్ ఉద్దేశపూర్వకంగా హిందూ మనోభావాలను దెబ్బతీసేలా చేసి ఉండొచ్చు. ఇది దైవదూషణ” అని మండిపడ్డాడు. “ఆమె కొత్త పాట హిందువులు, క్రైస్తవుల మత విశ్వాసాలను బహిరంగంగా అపహాస్యం చేస్తుంది. ఇది సృజనాత్మకత కాదు, ఇది పూర్తిగా అగౌరవం” అని మరొక నెటిజన్ సీరియస్ అయ్యాడు. “పిరుదుల నుండి శిలువను బయటకు తీయడం దారుణం. ఆమె అందరి మనోభావాలను దెబ్బతీసింది. బహుశా వైరల్ కావడానికి ఉద్దేశపూర్వకంగానే చేసిందేమో. ఇంత దారుణంగా దిగజారిపోయింది” అంటూ మరో నెటిజన్ నిప్పులు చెరిగాడు.

ఎవరీ టామీ జెనెసిస్..
భారత సంతతికి చెందిన టామీ జెనెసిస్ అకా జెనెసిస్ యాస్మిన్ మోహన్‌రాజ్ (34) వాంకోవర్‌లో జన్మించింది. కెనడియన్ రాపర్, మోడల్. ఆమెకు తమిళం, స్వీడిష్ నేపథ్యం ఉంది. ఆమె సంగీతం ప్రధానంగా లింగం, గుర్తింపు, లైంగికత ఇతివృత్తాలను ఎక్స్ ప్లోర్ చేస్తుంది. గతంలో తనను తాను “ఫెటిష్ రాపర్”గా పేర్కొంది. 2016లో ఒక అంతర్జాతీయ పత్రిక టామీ జెనెసిస్‌ను “ఇంటర్నెట్‌లో అత్యంత తిరుగుబాటుదారుడైన అండర్‌గ్రౌండ్ రాప్ క్వీన్” అని అభివర్ణించింది. తరువాత, ఆమె 2017లో డౌన్‌టౌన్ రికార్డ్స్/యూనివర్సల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

ఎమిలీ కార్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ నుండి పట్టభద్రురాలైంది. అక్కడ ఆమె తన సంగీత వృత్తిని ప్రారంభించడానికి ముందు చలనచిత్రం, శిల్పకళను అభ్యసించింది. జెనెసిస్ 2010 ప్రారంభంలో సంగీతాన్ని ప్రారంభించింది. 2013లో ‘G3NESIS’ అనే ప్రాజెక్ట్ కోసం రాప్‌ను రికార్డ్ చేయడం ప్రారంభించింది. తర్వాత అవ్ఫుల్ రికార్డ్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని తన తొలి మిక్స్‌టేప్ వరల్డ్ విజన్‌ను విడుదల చేసింది.

Also Read: వరల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ విమానం.. కేవలం రూ. 700కే 130 కి.మీ ప్రయాణం.. సింగిల్ ఛార్జ్‌తో 250 నాటికల్ మైళ్ల వరకు..!

ఆమె తొలి ఆల్బమ్ టామీ జెనెసిస్ నవంబర్ 2018లో విడుదలైంది. రెండవ ఆల్బమ్ గోల్డిలాక్స్ X సెప్టెంబర్ 2021లో విడుదలైంది. కాల్విన్ క్లైన్ ఆమెను ప్రచారానికి నియమించుకుంది. ఆమె 2017లో మెర్సిడెస్-బెంజ్ ఫ్యాషన్ వీక్‌లో రాపర్ M.I.A.తో జతకట్టింది. ఆఫీస్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జెనెసిస్ తన ఎంపికలను సమర్థించుకుంటూ, ‘ట్రూ బ్లూ’ అనేది తమ నమ్మకాలతో ముడిపెట్టే వారి కోసం ఉద్దేశించబడదని పేర్కొంది. కొత్త మ్యూజిక్ వీడియోపై ఎలాంటి మిశ్రమ భావాలు లేదా విమర్శలతో తాను బాధపడటం లేదని కూడా ఆమె స్పష్టం చేసింది.

జూలై 28, 2018న, రాపర్ ‘100 బాడ్’ అనే సింగిల్‌ను రిలీజ్ చేసింది. ఈ ట్రాక్ ఆమె సంగీత నిర్మాత చార్లీ హీట్‌తో కలిసి 2017లో ‘టామీ’ పాటను విడుదల చేసిన తర్వాత రెండవసారి జతకట్టింది. 34 ఏళ్ల ఈ కళాకారిణి సంగీతంతో పాటు మోడలింగ్‌లో కూడా కెరీర్‌ను ప్రారంభించింది. కాల్విన్ క్లైన్ ఆమెను 2016 ప్రచారానికి నియమించుకుంది. ఆమె మెర్సిడెస్-బెంజ్ ఫ్యాషన్ వీక్ (డైమ్లర్ AG బ్రాండ్ మెర్సిడెస్-బెంజ్ స్పాన్సర్ చేసిన అంతర్జాతీయ ఫ్యాషన్ వీక్‌ల శ్రేణి)లో రాపర్ M.I.A.తో కలిసి పనిచేసింది.

గోల్డ్ బికినీ, స్టిలెట్టోస్, బంగారు ఆభరణాలు ధరించి కాళికా మాతగా టామీ జెనెసిస్ చిత్రీకరించుకోవడం తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ‘ట్రూ బ్లూ’లో రాపర్ శిలువను నొక్కుతూ, చేతులు ముడుచుకుని ‘నమస్తే’ సంజ్ఞ చేస్తున్నట్లు కూడా చూపిస్తుంది. ఈ చిత్రాలు హిందువులు, కాథలిక్ విశ్వాసాలను అగౌరవపరిచాయని మండిపడుతున్నారు.

ఆఫీస్ మ్యాగజైన్‌తో ‘ట్రూ బ్లూ’ గురించి మాట్లాడుతూ, ఆమె ఇలా చెప్పింది, “మీకు నచ్చితే మీకు నచ్చుతుంది, మీకు నచ్చకపోతే మీకు నచ్చదు. మాకు పట్టింపు లేదు. ఇది మీ కోసం కాదు. చాలా కారణాల వల్ల అది మీకు కాకపోవచ్చు”.

భారతీయ రాపర్, గేయ రచయిత రఫ్తార్ ఈ వివాదాస్పద మ్యూజిక్ వీడియోపై తీవ్రంగా స్పందించాడు. జెనెసిస్‌ ను తప్పుపట్టాడు. తన ఇన్‌స్టాగ్రామ్ లో ఆమెపై సీరియస్ అయ్యాడు. “ఇది నా మతాన్ని అపహాస్యం చేయడమే” అంటూ నిప్పులు చెరిగాడు. అంతేకాదు.. ఆ మ్యూజిక్ వీడియోను రిపోర్ట్ చేస్తున్న స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశాడు. మీరు కూడా ఇదే విధంగా చేయండి అని తన అభిమానులను కోరాడు. “ఇది నా మతాన్ని అపహాస్యం చేయడం. ఇది ఉండకూడదు” అని వీడియోను రిపోర్ట్ చేయడానికి ఒక కారణంగా ఆయన పేర్కొన్నాడు.

‘ట్రూ బ్లూ’ సాంస్కృతిక, మతపరమైన భావాలను విస్మరించింది అంటూ ఆన్‌లైన్‌లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. నీలిరంగు బాడీ పెయింట్‌లో, బంగారు ఆభరణాలు, బిందీతో అలంకరించబడి, శిలువను పట్టుకుని కనిపిస్తుంది టామీ జెనెసిస్. శిలువను నాలుకతో టచ్ చేయడం, ‘నమస్తే’ సంజ్ఞ చేయడం.. ఈ చిత్రాలు రెచ్చగొట్టేలా, అగౌరవపరిచేలా ఉన్నాయని అంతా అంటున్నారు.

ఈ వీడియో హిందూ, క్రైస్తవ వర్గాలను రెచ్చగొట్టింది. వారు ఈ వీడియోపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. మా కాళికా మాత చిత్రీకరణను అగౌరవ పరిచారని హిందువులు సీరియస్ అయ్యారు. వెంటనే ఆ క్లిప్‌లను తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, క్రైస్తవులు సైతం భగ్గుమంటున్నారు. ‘ట్రూ బ్లూ’ అనేది టామీ జెనెసిస్ రాబోయే మ్యూజిక్ ఆల్బమ్ జెనెసిస్ నుండి ఒక పాట. ఈ మ్యూజిక్ వీడియో శనివారం విడుదలైంది.