Indian Passengers : భారతీయులకు గుడ్‌న్యూస్.. కెనడా ఆ నిబంధనలు ఎత్తేసింది..!

కెనడా ప్రభుత్వం.. భారతీయులకు రిలీఫ్ కలిగించే విషయం చెప్పింది. తమ దేశానికి వచ్చే భారతీయులకు నిబంధనల నుంచి సడలింపు ఇస్తున్నట్టు ప్రకటించింది.

Indian Air Passengers :  ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి వ్యాపిస్తోంది. ఎక్కడికి వెళ్లినా కరోనా కేసులే కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కెనడా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే భారతీయులకు మాత్రం ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు. ప్రస్తుతం చాలా ప్రపంచ దేశాలు కరోనా ఆంక్షలు విధిస్తున్నాయి. తమ దేశాలకు వచ్చే విదేశీ ప్రయాణికుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాయి.

కెనడా ప్రభుత్వం.. భారతీయులకు రిలీఫ్ కలిగించే విషయం చెప్పింది. తమ దేశానికి వచ్చే భారతీయులకు నిబంధనల నుంచి సడలింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. భారత్ నుంచి నేరుగా లేదా గల్ఫ్, యూరప్, అమెరికా నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా నిబంధనల నుంచి సడలింపు ఇస్తున్నట్టు కెనడా ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఈ పరిస్థితుల్లో దేశానికి వచ్చే ప్రయాణికుల పట్ల కెనడా కఠిన ఆంక్షలు విధించింది. కెనడాకు వెళ్లే ప్రయాణికులు ఎవరైనా సరే 18 గంటల ముందు కోవిడ్‌ నెగటీవ్‌ సర్టిఫికేట్‌ (RTPCR‌) సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే కెనడా వెళ్లేందుకు అనుమతినిస్తుంది. అయితే సింగిల్ స్టాప్ విమాన ప్రయాణికుల విషయంలోనూ కెనడా కఠినంగానే వ్యవహరిస్తోంది. మార్గమధ్యలో ఎయిర్ పోర్టుల్లో కూడా నెగటివ్ సర్టిఫికేట్ తీసుకోవాలనే నిబంధనను చేర్చింది.

అందుకే చాలామంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో క్వారంటైన్ సెంటర్లకు వెళ్లాల్సి వస్తోంది. పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. కెనడా ప్రభుత్వం సడలించిన నిబంధనలతో భారతీయ ప్రయాణికులు ఊరట కలిగించినట్టే.. కెనడా ప్రభుత్వం సవరించిన ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఇండియా నుంచి నేరుగా లేదా సింగిల్‌ స్టాప్‌లో వచ్చే ప్రయాణికులకు 18 గంటల కోవిడ్‌ సర్టిఫికేట్‌ నుంచి మినహాయింపు లభించింది. విమాన ప్రయాణానికి 72 గంటల ముందు కోవిడ్‌ నెగటివ్‌ సర్టిఫికేట్‌ టెస్టు మాత్రమే చూపించాల్సి ఉంటుంది.


ఒక్క భారత్ మాత్రమే కాదు.. మొరాకో దేశానికి కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. 2022 జనవరి 28 నుంచి ఈ మినహాయింపు అమల్లోకి రానుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో భారతీయ ప్రయాణికులపై కెనడా ప్రభుత్వం నిషేధం విధించింది. 5 నెలల తర్వాత 2021 సెప్టెంబరు 27న భారతీయ ప్రయాణికులకు అనుమతి ఇచ్చింది. ఇంతలోపే ఒమిక్రాన్‌ వేరియంట్ కేసులు పెరగడంతో కెనడా ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు విధించింది.

Read Also : Unstoppable with NBK: రెండో సీజన్ కి సర్వం సిద్ధం.. తొలి గెస్ట్ ఎవరంటే?

ట్రెండింగ్ వార్తలు