Lawrence Wong : సితార్ వాయించిన ఆ దేశ ఉప ప్రధానిపై నరేంద్ర మోదీ ప్రశంసలు

ఆ దేశ ఉప ప్రధాని తాను సితార్ నేర్చుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోను చూసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

Lawrence Wong

Lawrence Wong : సింగపూర్ ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ భారతీయ శిక్షకుడి నుంచి సితార్ నేర్చుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

Anushka Sharma Viral Post : భర్త కోహ్లీపై అనుష్కా శర్మ తాజా కామెంట్… వైరల్ అయిన సోషల్ మీడియా పోస్టు

సింగపూర్ ఉప ప్రధాని లారెన్స్ వాంగ్ భారతీయ శిక్షకుడు కార్తిగయన్ నుండి సితార్ నేర్చుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కార్తిగయన్‌ను తన బోధకునిగా వాంగ్ వీడియోలో పరిచయం చేశారు. కార్తిగయన్ సితార్ చరిత్ర గురించి రుద్రవీణ, సేహ తార్ అనే రెండు వాయిద్యాల మధ్య ఉన్న బేధాన్ని వాంగ్‌కు వివరించాడు. అంతేకాదు సితార్ వాయిద్యాన్ని ఎలా కూర్చుని పట్టుకోవాలో కూడా నేర్పించాడు. మొదటగా నేర్చుకునే ని,స,రి స్వరాలను ప్లే చేయమని అడిగాడు.

లారెన్స్ వాంగ్ ఈ వీడియోకి ‘ సితార్‌లోని అందమైన రాగాలను పరిచయం చేస్తున్నాను. కొంతకాలంగా కార్తిగయన్ నుంచి నేర్చుకుంటున్నాను..బేసిక్ లెసెన్స్ అతను ఎంతో సహనంతో నాకు నేర్పిస్తున్నాడు. గొప్ప శాస్త్రీయ భారతీయ సంగీత వారసత్వం గురించి మరింత తెలుసుకునే అవకాశం కలిగింది’ అనే శీర్షికతో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

IND vs NZ Semi Final : నేను మ్యాచ్ చూసేందుకు వెళ్తున్నా..! సూపర్ స్టార్ రజనీకాంత్ వీడియో వైరల్

భారత ప్రధాని నరేంద్ర మోదీ లారెన్స్ వాంగ్ పోస్ట్‌పై స్పందించారు. ఆయన వీడియోను రీపోస్ట్ చేసారు. వీడియోకి ‘సితార్ పట్ల మీ అభిరుచి ఇతరులకు స్ఫూర్తిని అందించాలి. ఈ మధురమైన ప్రయత్నానికి శుభాకాంక్షలు. భారతదేశ సంగీత చరిత్ర  వైవిధ్యం సింఫొనీ, ఇది వేల సంవత్సరాలుగా ఉద్భవించిన లయల ద్వారా ప్రతిధ్వనిస్తుంది’ అనే శీర్షికను యాడ్ చేసారు మోదీ. వాంగ్ పోస్ట్.. మోదీ రీపోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి. నెటిజన్లు సితార్ నేర్చుకోవడానికి వాంగ్ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు.