అమెరికాలో ఓ వైపు కరోనా వైరస్..మరోవైపు అల్లర్ల కారణంగా భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జార్జ్ ఫ్లాయిడ్ హత్య అగ్రరాజ్యాన్ని అట్టుడికిస్తోంది. ఆందోళనకారులు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. విధ్వంసం, లూటీలతో భారతీయులు ఇక్కట్లు పడుతున్నారు. అనేక దుకాణఆలు, రెస్టారెంట్లు ధ్వంసమయ్యాయని సమాచారం. కరోనా రాకాసితో ఆర్థికంగా దెబ్బతిన్న వ్యాపారాలు..ప్రస్తుత పరిస్థితితో దివాళా తీసే పరిస్థితి నెలకొందని పలువురు NRIలు వాపోతున్నారు. మినియా పోలిస్ లో భారతీయులకు చెందిన దుకాణాలు అధికంగా ఉన్నాయి.
సుమారు 308 దుకాణాలు, రెస్టారెంట్లు విధ్వంసానికి గురయ్యాయని స్థానిక మీడియా వెల్లడించింది. గాంధీ మహల్ రెస్టారెంట్, హండీ రెస్టారెంట్, ఇంటర్నేషనల్ బజార్, అనన్య డ్యాన్స్ థియేటర్ లాంటి దుకాణాలున్నాయి. అయితే..తెలుగు వారికి సంబంధించినవి లేవని తెలుగు సంఘాల ప్రతినిధులు వెల్లడించారు. ఇక నిరసనల్లో భారతీయులకు చెందిన పదుల సంఖ్యలో దుకాణాలు ధ్వంసమయ్యాయని మినియా పోలిస్ డౌన్ టౌన్ లోని తెలుగు వారు క్షేమమేనని తెలుస్తోంది.
న్యూయార్స్ సిటీలో ఓ వైపు కరోనా కారణంగా అల్లాడుతుండగా..జార్జ్ ఫ్లాయిడ్ హత్యకి నిరసనగా ఆందోళనలు మంగళవారం కూడా కొనసాగాయి. ఈ ఆందోళన ముసుగులో అన్ని చోట్లా అల్లరిమూకలు లూటీలకు పాల్పడుతున్నారు. ఆస్తుల ధ్వంసానికి దిగారు. వాషింగ్టన్ డిసిలో భారీగా పోలీసులు రంగంలోకి దిగినా..ప్రయోజనం లేకపోయింది.. ఫిలడెల్ఫియా, మినియాపులీస్‌లో మాత్రం ఆందోళనకారులు ఓ వైపు శాంతియుతంగా ధర్నాలు చేస్తుండగా..మరోవైపు అల్లరిమూకలు యధేచ్చగా విధ్వంసానికి పాల్పడుతున్నారు. దీంతో దేశంలోని 50 నగరాల్లో అమెరికా ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.
Nike store on Michigan Ave smashed and completely looted pic.twitter.com/IRZc4FuDBO
— Ben Pope (@BenPopeCST) May 31, 2020
Read: మోడీ, ట్రంప్ ఫోన్ సంభాషణ… జీ-7 దేశాల సమావేశం, కరోనాపై చర్చలు