Indian truck drivers : ఉత్తర అమెరికాలో భారతీయ ట్రక్ డ్రైవర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?
ఉత్తర అమెరికాలో మనోళ్లు బాగా సంపాదిస్తున్నారు.. అమెరికా, కెనడా దేశాల్లో ప్రతి ఏడాది వలసవెళ్లే వేలాదిమంది భారతీయులు అంతా సెటిల్ అవుతున్నారు. వీరిలో ఉద్యోగాల కోసం వెళ్లేవారు, అక్కడి నివసించేవారే ఎక్కువగా ఉన్నారు.

Indian Truck Drivers How Much Do They Earn In North America
Indian truck drivers in North America : ఉత్తర అమెరికాలో మనోళ్లు బాగా సంపాదిస్తున్నారు.. అమెరికా, కెనడా దేశాల్లో ప్రతి ఏడాది వలసవెళ్లే వేలాదిమంది భారతీయులు అంతా సెటిల్ అవుతున్నారు. వీరిలో ఉద్యోగాల కోసం వెళ్లేవారు, అక్కడి నివసించేవారే ఎక్కువగా ఉన్నారు. అన్ని లీగల్ జాబ్స్ చేసేవారికి మంచి వేతనాలు కూడా ఇస్తున్నాయి. అందులో ట్రకింగ్ డ్రైవర్లు కూడా పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు. ఈ ట్రక్ డ్రైవర్లు వాస్తవానికి ఎంత సంపాదిస్తున్నారో తెలుసా? విదేశాల్లో పనిచేసే కొంతమంది మన దేశీయ ట్రక్ డ్రైవర్లు తమ వేతనాలు, అనుభవాలను గురించి వివరించారు.
సాట్నమ్ సింగ్.. ఇతనికి యుబా సిటీ ట్రక్ వెహికల్ ఉంది. ఉత్తర కాలిఫోర్నియాలో కొన్నేళ్లుగా నడుపుతున్నారు. ఇండియాలోని పంజాబ్ తో పోలిస్తే అమెరికాలో ట్రకింగ్ ఎలా ఉంటుందో ఆయన తన అనుభవాలను షేర్ చేశారు. ప్రతిరోజు 10 నుంచి 12 గంటలు ట్రకింగ్ పనిచేస్తారంట. కొన్ని రోజులు ఆఫ్ తీసుకుంటారట. ఏడాదికి సింగ్ సంపాదన 2 లక్షల డాలర్లు నుంచి 2.25వేల డాలర్లు వరకు ఉంటుంది. భారత కరెన్సీలో నెలకు రూ.13 లక్షలు.. ఏడాదికి రూ.1.6 కోట్లు అనమాట.
విజయ్.. కెనడాలో ట్రక్ డ్రైవర్.. బ్రిటీష్ కొలంబియాలో ఆరేళ్లుగా ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ట్రక్ తన సొంతం కాదని, డ్రైవర్ గా పనిచేస్తున్నాడట.. వారానికి ఐదు రోజులు మాత్రమే చేస్తాడు. 50శాతం మెడికల్ ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు. శీతాకాలం సమయంలో గడ్డుకట్టేంత చలిలో 35 సెల్సియస్ ఉష్ణోగ్రతలో కూడా పనిచేస్తారు. ట్రక్ 18 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఉంది. సీబీ రేడియో కూడా ఉంది. కెనడాలో ట్రకర్లు ప్రతి గంటకు 30 నిమిషాలు ఆగాల్సి ఉంటుంది. రోజుకు 12 గంటలు పనిచేస్తాడు. ఇతడి సంపాదన 66వేల CAD, భారత కరెన్సీలో రూ.28 లక్షలు. ఎక్కువ గంటలు పనిచేస్తే ఆదాయం అంతకంటే ఎక్కువగా సంపాదిస్తారు.
అమెరికాలో కాలిఫోర్నియా ప్రాంతంలో మన్ ప్రీత్ అనే వ్యక్తి.. ట్రకర్ పనిచేస్తాడు. సొంత ట్రక్ కాదు.. ఉద్యోగం మాత్రమే.. బంక్ బెడ్స్, స్టోరేజీ ప్లేస్, ఎయిర్ కండీషనర్ వంటి మోడ్రాన్ ఫీచర్లతో ఎంతో లగ్జరీగా ఉంటుంది ఇతడి వెహికల్. ట్రక్ లోనే ఫుడ్ కుక్ చేసుకోవచ్చు. ప్రతి ఏడాది తన డ్యూటీ అవర్లలో 5వేల అమెరికన్ డాలర్లు సంపాదిస్తాడు. ఇండియాలో కంటే అమెరికాలో పనిచేయడం అంతే స్థాయిలో డబ్బు సంపాదించడం చాలా ఈజీని వివరించాడు. స్టేట్ బోర్డర్లలో పోలీసులు వీరిని ఆపరంట.. అక్కడ అవినీతికి కూడా చోటు ఉండదట..