అదృష్టం ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. లక్ష్మీ ఒకసారే వస్తుంది…తంతే బూరెల బుట్టలో పడటం అంటే ఇదేనేమో అనుకుంటున్నారు. ఎందుకంటే..ఓ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిపోయాడు. లాటరీలో ఏకంగా 10 మిలియన్స్ దిర్హమ్స్ (సుమారు రూ. 20 కోట్లు) గెలుచుకున్నాడు. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఉపాధి కోసమని దుబాయ్ వెళ్లిన ఈ సేల్స్ మెన్ వార్తల్లో నిలిచాడు.
కేరళ రాష్ట్రానికి చెందిన త్రిశ్శూర్ ప్రాంతానికి చెందిన దిలీప్ కుమార్ ఎల్లికొట్టిల్ పరమేశ్వరన్ యునెటైడ్ అరబ్ ఏమిరేట్స్ (UAE) అజ్మాన్ నగరంలో ఉన్న ఓ ఆటోమొబైల్ సంస్థలో సేల్స్ మెన్స్ గా పని చేస్తున్నాడు. ఇతను లాటరీలు కొనుగోలు చేస్తుంటాడు. ఎప్పుడైనా అదృష్టం తలుపు తట్టకపోదా ? అనుకొనే వాడు. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతి నెలా మూడో తేదీన Big Ticket Draw పేరిట నిర్వహించిన లాటరీ టికెట్ ను 500 దిర్హమ్స్ (రూ. 10 వేలు) ticket number 76713 పెట్టి కొన్నాడు.
ఈసారి తీసిన లాటరీ డ్రాలో దిలీప్ సుమారు రూ. 20 కోట్లు గెలుచుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న దిలీప్ సంతోషం వ్యక్తం చేశాడు. గెలుచుకున్న మొత్తంలో కొంత సొమ్ము బ్యాంకు లోన్ కు చెల్లించి..మిగిలిన డబ్బును ఇద్దరు పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తానని వెల్లడించాడు. ఇతని కుటుంబం 17 సంవత్సరాల నుంచి అజ్మాన్ నగరంలో నివాసం ఉంటున్నారు.
See Also | ఒక్కడే 501కేజీలు ఎత్తి వరల్డ్ రికార్డ్ కొట్టేశాడు