Indonesia Earthquake : ఇండోనేషియాలో 7.3 తీవ్రతగా భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ

ఇండోనేషియాలో మరోసారి ఇండోనేషియాను భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతగా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

Earthquake in Indonesia : ఇండోనేషియాలో భూకంపాలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఈక్రమంలో మరోసారి ఇండోనేషియాను భారీ భూకంపం అతలాకుతలం చేసేసింది. మంగళవారం (డిసెంబర్ 14,2021) తెల్లవారుజామున దక్షిణ ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతగా నమోదైందని US జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇండోనేషియా తూర్పు నుసా టెంగ్‌గెరా ప్రావిన్సుల్లో ఫ్లోరేస్ దీవికి ఉత్తరంగా భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో సంభవించిన భూకంపం భీభత్సం సృష్టించింది.

Read more :MBA Admissions : యూఓహెచ్ లో ఎంబీఏ ప్రవేశాలు

భూకంపం తర్వాత జనం ఇళ్ల నుంచి భయంతో పరుగులు తీశారు. భూకంప ప్రభావిత ప్రాంతాల ప్రజలు భయపడొద్దని సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఫ్లోరెస్‌లో సముద్రానికి 18.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. మౌమెరే పట్టణానికి ఉత్తరంగా 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది. భూకంప కేంద్రం నుంచి 1,000 కిలోమీటర్ల పరిధిలో భారీ అలలు వచ్చే అవకాశం ఉందని ముందుగా హెచ్చరించిన తర్వాత భూకంపం వల్ల ఇకపై సునామీ ముప్పు లేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది.

Read more : Modi in Varanasi: వారణాసిలో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన

జపాన్ నుంచి ఆగ్నేయాసియా.. పసిఫిక్ బేసిన్ మీదుగా విస్తరించి ఉన్న భూకంప కార్యకలాపాలకు కారణమయ్య టెక్టోనిక్ ప్లేట్స్‌ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ స్థానంలో ఇండోనేషియా ఉండటం వల్ల తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తాయి. 2004 డిసెంబరు 26 ఇండోనేషియాలో 9.1 తీవ్రత భారీ భూకంపం సంభవించి సునామీకి ఎంతగా అల్లకల్లోలం చేసిందో చెప్పనక్కరలేదు.ఈ గాయం నుంచి ఈనాటికి కోలుకోలేని స్థితిలో ఉన్నారు బాధితులు. ఈ సునామీ ప్రపంచవ్యాప్తంగా 2.20 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా.. ఒక్క ఇండోనేషియాలోనే 1.70 లక్షల మంది చనిపోయారు.

 

ట్రెండింగ్ వార్తలు