MBA Admissions : యూఓహెచ్ లో ఎంబీఏ ప్రవేశాలు

కోర్సు ప్రణాళికను నాలుగు సెమిస్టర్లుగా విభజించారు. మొదటి రెండు సెమిస్టర్లలో కోర్‌, ఫౌండేషన్‌ కోర్సులు ఉంటాయి. ఇందులో భాగంగా మేనేజ్‌మెంట్‌ కాన్సెఫ్ట్స్‌ అండ్‌ అప్రోచెస్‌, మేనేజేరియల్‌ అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌,

MBA Admissions : యూఓహెచ్ లో ఎంబీఏ ప్రవేశాలు

Uoh

MBA Admissions : కేంద్రీయ విశ్వవిద్యాలయమైన హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌(యూఓహెచ్‌)లో 2022-24 విద్యా సంవత్సరానికి గాను ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎంబీఏ)లో మార్కెటింగ్‌, ఫైనాన్స్‌, ఆపరేషన్స్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌, బ్యాంకింగ్‌ తదితర విభాగాల్లో అడ్మిషన్స్ నిర్వహించనున్నారు.

కోర్సు వివరాలను పరిశీలిస్తే ఇది రెండేళ్ల ఫుల్‌టైం కోర్సు. మొత్తం 60 సీట్లున్నాయి. వీటిల్లో ఎస్టీలకు 15 శాతం, ఎస్సీలకు 7, ఓబీసీలకు 27, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 10, దివ్యాంగులకు 5, యుద్ధ వితంతువులకు 5 శాతం సీట్లను రిజర్వు చేశారు. మరో 15 శాతం సీట్లను విదేశీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కేటాయించారు.

కోర్సు ప్రణాళికను నాలుగు సెమిస్టర్లుగా విభజించారు. మొదటి రెండు సెమిస్టర్లలో కోర్‌, ఫౌండేషన్‌ కోర్సులు ఉంటాయి. ఇందులో భాగంగా మేనేజ్‌మెంట్‌ కాన్సెఫ్ట్స్‌ అండ్‌ అప్రోచెస్‌, మేనేజేరియల్‌ అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, మార్కెటింగ్‌ ఆర్గనైజేషనల్‌ బిహేవియర్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌, బిజినెస్‌ అనలిటిక్స్‌, ఎకనామిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, కమ్యూనికేషన్‌ అండ్‌ పర్సనల్‌ ఎఫెక్టివ్‌నెస్‌, ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌, రీసెర్చ్‌ మెథడాలజీ అండ్‌ బిజినెస్‌ ఎన్విరాన్‌మెంట్‌లను బోధిస్తారు. దీనికి అదనంగా తొలి సెమిస్టర్‌లోనే ఐదు రోజుల సెల్ఫ్‌ అవేర్‌నెస్‌, గ్రోత్‌ ల్యాబ్‌ ఈవెంట్లను ఏర్పాటు చేస్తారు. రెండు, మూడో సెమిస్టర్‌కు మధ్య వచ్చే వేసవిలో ఎనిమిది వారాల ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు కూడా అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంటుంది. వర్తమాన యాజమాన్య పద్ధతులు, పని వాతావరణం, ఆర్గనైజేషనల్‌ కల్చర్స్‌పై అవగాహన పెరిగేందుకు ఈ ఇంటర్న్‌షిప్‌ దోహదపడుతుంది. ఇక రెండో ఏడాదిలో అభ్యర్థులు వారికి ఆసక్తి ఉన్న ఏవైనా రెండు స్పెషలైజేషన్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు సెమిస్టర్లలో కూడా అభ్యర్థులు తాము ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్లలోనే ప్రాజెక్ట్‌ వర్క్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది.

కోర్సులో చేరాలనుకునే వారికి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 2022 జూన్‌ నాటికి డిగ్రీ ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. క్యాట్‌-2021కు హాజరై ఉండాలి. అకడమిక్‌ మెరిట్‌, క్యాట్‌ స్కోరు, ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.దరఖాస్తు ఫీజు కు సంబంధించి జనరల్‌ రూ.600, ఈడబ్ల్యూఎస్‌ రూ.550, ఓబీసీ రూ.400, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.275 చెల్లించాలి. దరఖాస్తుకు చివరి తేదీ 31.01.2022 గా నిర్ణయించారు. వెబ్‌సైట్‌: http://acad.uohyd.ac.in/