Tana Toraja : చెట్ల తొర్రల్లో పిల్లల శవాలు..ఆ చెట్లనే బిడ్డలుగా చూసుకుంటున్న తల్లిదండ్రులు

ప్రపంచ వ్యాప్తంగా ఉండే వందలాది దేశాల్లో వింత వింత సంప్రదాయాలు ఉంటాయి. సంప్రదాయాలు అంటే ముఖ్యంగా చావు, పుట్టుక, వివాహాలు విషయాల్లో పాటించే పద్ధతులు వింతగా విచిత్రంగా..ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. ఏనాడో ఆయా పరిస్థితులను బట్టి ప్రారంభమైన పద్ధతులే సంప్రదాయాలుగా మారిపోతుంటాయి. అటువంటి ఓ వింత సంప్రదాయం గురించి తెలుసుకుందాం..

Dead Body Buries In Tree Trunk : ప్రపంచ వ్యాప్తంగా ఉండే వందలాది దేశాల్లో వింత వింత సంప్రదాయాలు ఉంటాయి. సంప్రదాయాలు అంటే ముఖ్యంగా చావు, పుట్టుక, వివాహాలు విషయాల్లో పాటించే పద్ధతులు వింతగా విచిత్రంగా..ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. ఏనాడో ఆయా పరిస్థితులను బట్టి ప్రారంభమైన పద్ధతులే సంప్రదాయాలుగా మారిపోతుంటాయి. అటువంటి ఓ వింత సంప్రదాయం గురించి తెలుసుకుందాం..సాధారణంగా ఎవరైనా చనిపోతే..ఆయా మతాల సంప్రదాయాలను బట్టి సమాధుల్లో పూడ్చిపెడతారు. లేదంటే దహనం చేయటం చేస్తారు. కానీ ఇండోనేసియాలోని ‘తానా తరోజా’ (Tana Toraja)అనే తెగ ప్రజలు మాత్రం విచిత్ర సంప్రదాయాన్ని పాటిస్తోంది. ఈ తెగలో ఎవరైనా పిల్లలు చనిపోతే..వారిని ఖననం చేయరు. దహనం కూడా చేయరు.చెట్టు తొర్రల్లో ఉంచుతారు. చిన్నపిల్లల మృతదేహాలను చెట్టు లోపల పాతి పెట్టే (Dead Body Buries In Tree Trunk) సంప్రదాయాన్ని ఎన్నో ఏళ్లుగా.. తానా తరోజా ప్రజలు పాటిస్తున్నారు.

ఈ తెగలో పిల్లలు చనిపోతే చెట్టు తొర్రల్లోనే పెడతారు. కానీ పెద్దవారి విషయంలో అలాకాదు. పెద్దవారు మరణిస్తే..సాధారణ పద్దతిలోనే అంత్యక్రియలు చేస్తారు. కానీ పిల్లల విషయంలో మాత్రం విచిత్ర సంప్రదాయాన్ని పాటిస్తున్నారు నేటికీ. పిల్లల చనిపోతే తల్లిదండ్రుల బాధ మాటల్లో చెప్పలేం. ప్రతీక్షణం గుండెల్లో ఆవేదన సుడులు తిరుగుతునే ఉంటుంది. చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. తానా తరోజా తెగ ప్రజలు ప్రకృతిని దేవుడిగా కొలుస్తారు. అందుకే చిన్నారులు చనిపోతే ప్రకృతిలో కలిపే సంప్రదాయాన్ని పాటిస్తారు.

మరణించిన వారిని చెట్టులో కలిపేస్తారు. అంటే పెద్ద పెద్ద చెట్లను ఎంచుకుని వాటికి కాండాన్ని తొలిచి పెద్ద రంధ్రం చేస్తారు. తరువాత చనిపోయిన చిన్నారి మృతదేహాన్ని
పెద్ద పెద్ద చెట్లుకు కన్నం పెట్టి.. కాండం తొలగిస్తారు. తొర్రలను ఏర్పాటు చేసి.. అందులో పిల్లలను ఖననం చేస్తారు. ఇక అప్పటినుంచి ఆ చెట్టునే తమ బిడ్డగా భావిస్తారు. చెట్టు భూమిపై ఉన్నంత కాలం..తమ పిల్లలు కూడా తమతోనే ఉన్నారని భావిస్తారు. దేవుడు తమ బిడ్డలను దూరం చేసినప్పటికీ.. చెట్టు రూపంలో తమ వద్దే ఉంటారని నమ్ముతారు. ఆ చెట్టును ఎంతో ప్రేమంగా చూసుకుంటారు. ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా కాపాడుకుంటారు.

శవాలను ముక్కలు చేసి..చెట్లపై..
దాదాపు ఇటువంటి విచిత్ర సంప్రదాయాన్నే టిబెట్, మంగోలియా ప్రాంతాల్లోని ప్రజలు కూడా పాటిస్తున్నారు.టిబెట్, మంగోలియా ప్రాంతాల ప్రజలు చనిపోయిన వారి మృతదేహాన్ని చెట్లపై ఉంచుతారు. శవాన్ని చిన్న చిన్న ముక్కలుగా నరికి పర్వతంపైన లేదంటే చెట్టుపై వేలాడదీస్తారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మ త్వరగా స్వర్గ ద్వారాలకు చేరుతుందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.

శవాలను రాబంధులకు ఆహారంగా వేసే వింత సంప్రదాయం..
పార్సీ సమాజంలోని ప్రజలు శవాలను రాబంధులకు ఆహారంగా విసిరేస్తారు. ఎవరైనా మరణిస్తే.. వారి మృతదేహానికి స్నానం చేయించి.. తమ ప్రార్థనా స్థలం వద్ద విసిరేస్తారు. ఆ తర్వాత రాబందులు వచ్చి ఆ శవాన్ని పీక్కు తింటాయి. ఒక వ్యక్తి మరణించిన తర్వాత.. వారి ఆత్మ ఖచ్చితంగా తన శరీరాన్ని విడిచిపెడుతుంది అంటారు. రాబందులు ఈ విషయంలో మానవులకు సహాయం చేస్తాయని వారు నమ్ముతారు.

ట్రెండింగ్ వార్తలు