Miss Universe 2023 : మిస్ యూనివర్స్ కిరీటం కోసం భారత్ తరపున పోటీపడుతున్న శ్వేతా శారద ఎవరు?

ఈసారి 'మిస్ యూనివర్సిటీ' కిరీటం భారత్‌కు దక్కుతుందా? భారత్ నుంచి పోటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న 'శ్వేతా శారద' ఎవరు?

Miss Universe 2023 : మిస్ యూనివర్స్ కిరీటం కోసం భారత్ తరపున పోటీపడుతున్న శ్వేతా శారద ఎవరు?

Miss Universe 2023

Miss Universe 2023  : 2023 విశ్వసుందరి కిరీటం కోసం ఈసారి 84 దేశాలు పోటీపడుతున్నాయి. అయితే 72వ మిస్ యూనివర్స్ పోటీలు ఎక్కడ నిర్వహిస్తున్నారు? భారతదేశం నుంచి పోటీ పడుతున్న ఆ అందాల సుందరి ఎవరు? చదవండి.

Karthika Nair : కాబోయే భర్తను పరిచయం చేస్తూ ఫోటోలు షేర్ చేసిన నటి

మరికొన్ని గంటల్లో మిస్ యూనివర్స్ కిరీటం గెలుచుకోబోతున్న దేశం, ఆ అందాల భామ ఎవరో వెల్లడికాబోతోంది. 72 వ మిస్ యూనివర్సిటీ పోటీలు ఫ్యాషన్ షోకి రాజధానిగా పిలవబడే శాన్ సాల్వడార్‌లోని జోస్ అడాల్ఫో పినెడా అరేనాలో నిర్వహిస్తున్నారు. ఈసారి మిస్ యూనివర్స్ కిరీటం కోసం 84 దేశాలు పోటీ పడుతున్నాయి. 13,000 మంది ఈ షోను ప్రత్యక్షంగా వీక్షించబోతున్నారు. ఈ ఈవెంట్ రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు.

ఈసారి పోటీల్లో భారతదేశం తరపున శ్వేతా శారద ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చండీగఢ్‌కు చెందిన 23 ఏళ్ల శారద పేరు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. శ్వేతా శారద మే 24, 2000 లో చండీగఢ్‌లో జన్మించారు. శారద 16 సంవత్సరాల వయసులో మోడల్‌గా కెరియర్ మొదలుపెట్టారు. డాన్స్ ఇండియా డాన్స్, డాన్స్ దీవానే, డాన్స్ ప్లస్ రియాల్టీ షోలతో చాలా పాపులర్ అయ్యారు శారద. ఇండిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ తీసుకున్న శారద మ్యూజిక్ వీడియోలలో కూడా నటించారు. గంగూబాయి కతివాడి నటుడు శంతను మహేశ్వరితో కూడా వీడియోలో స్క్రీన్ పంచుకున్నారు శారద.

Jabardasth Rakesh : జబర్దస్త్ రాకేష్ కి షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్.. పాపం రాకింగ్ రాకేష్ పరిస్థితి..

2023, ఆగస్టు 28 న జరిగిన ఈవెంట్ శ్వేతా శారద ‘మిస్ బాడీ బ్యూటిఫుల్’ , ‘మిస్ టాలెంటెడ్’ అవార్డులను గెలుచుకున్నారు. తాజా ఇంటర్వ్యూల్లో శారద పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘అమ్మాయిలు తమ కలలు నెరవేర్చుకునేలా వారిని శక్తివంతం చేయడమే నా లక్ష్యం.. ఎటువంటి అవమానాలు ఎదురైనా ఆడవారు తమ లక్ష్యాలను విడిచిపెట్టకూడదు.. మీ లక్ష్యాలకు మీరు కట్టుబడి ఉండాలి.. ప్రతి ఒక్కరి కలలు నిజం చేసుకునేలా ప్రేరణ కలిగించడానికే  నేను ఇక్కడ నిలబడి ఉన్నాను’ అంటూ మాట్లాడారు. శ్వేత శారదలోని కాన్ఫిడెన్స్ ఇండియాకు ఈ ఏడాది విశ్వసుందరి కిరీటం ఖచ్చితంగా తీసుకువస్తుందని ఆశిద్దాం.

 

View this post on Instagram

 

A post shared by Miss Diva (@missdivaorg)

 

View this post on Instagram

 

A post shared by Miss Diva (@missdivaorg)