Karthika Nair : కాబోయే భర్తను పరిచయం చేస్తూ ఫోటోలు షేర్ చేసిన నటి
పాత తరం నటి రాధ కూతురు కార్తీక నటిగా అందరికి తెలుసు. తెలుగు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కార్తీక త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. తన కాబోయే భర్తను పరిచయం చేస్తూ నిశ్చితార్థం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Karthika Nair
Karthika Nair : నటి కార్తీక ‘జోష్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళ్, మళయాళం, కన్నడ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. కాగా ఈ నటి ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. తన కాబోయే భర్తను పరిచయం చేస్తూ తన నిశ్చితార్థం ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. కార్తీకకు కాబోయే భర్త ఎవరు?
కార్తీక ప్రముఖ నటి రాధ కూతురుగా అందరికీ తెలుసు. అయితే తనదనే టాలెంట్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2009 లో వచ్చిన జోష్ సినిమాలో నాగ చైతన్యకు జోడీ నటించి వెండితెరపై అడుగుపెట్టారు. ఆ తర్వాత జీవా, పియా బాజ్ పాయ్‌కీ రోల్స్‌లో నటించిన ‘కో’ సినిమాకి వచ్చిన పాపులారిటీతో వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. తెలుగులో దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ వంటి సినిమాలతో అలరించారు. ప్రస్తుతం ఈ నటి పెళ్లి పీటలెక్కుతున్నారు.
కార్తీక ఇటీవలే రోహిత్ మీనన్‌తో నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థం ఫోటోలు కార్తీక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ నెలలో ఈ జంట పెళ్లి పీటలెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కార్తీక నాయర్ చివరిసారిగా 2015 లో ఆర్యతో కలిసి ‘పురంపోక్కు ఎంగిర పొదువుడమై’లో కనిపించారు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. రీసెంట్‌గా తన నిశ్చితార్థం ఫోటోలను షేర్ చేస్తూ ‘మిమ్మల్ని కలవడం విధి రాత.. మీ ప్రేమలో పడిపోవడం మాయాజాలం.. కలిసి జీవించడానికి కౌంట్ డౌన్ మొదలైంది’ అనే శీర్షికను యాడ్ చేసారు కార్తీక.
కార్తీక నాయర్ పాతతరం నటి రాధ, రాజశేఖరన్ దంపతుల కూతురు. సినిమాలతో పాటు 2017 లో ‘ఆరంభ్’ అనే టెలివిజన్ సీరియల్‌లో దేవసేన పాత్రలో మెరిసారు కార్తీక. కార్తీక నిశ్చితార్థం ఫోటోలకు నెటిజన్ల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
View this post on Instagram