Guppedantha Manasu : దేవయానిని కలిసిన అనుపమ.. మహేంద్ర గురించి దేవయాని చెప్పిన కట్టుకథలు అనుపమ నమ్మేస్తుందా?

జగతి మరణం గురించి వివరాలు తెలుసుకోవడానికి కాలేజీకి వెళ్లిన అనుపమని శైలేంద్ర చూస్తాడు. తల్లి దేవయానితో ఫోన్ చేయించి ఇంటికి తీసుకెళ్తాడు. దేవయాని అనుపమను ఇంటికి పిలవడం వెనుక కొత్త కుట్ర ఏంటి? అనుపమ దేవయాని చెప్పిన మాటలు నమ్మేస్తుందా?

Guppedantha Manasu : దేవయానిని కలిసిన అనుపమ.. మహేంద్ర గురించి దేవయాని చెప్పిన కట్టుకథలు అనుపమ నమ్మేస్తుందా?

Guppedantha Manasu 4

Updated On : November 18, 2023 / 12:22 PM IST

Guppedantha Manasu : కాలేజీలో అనుపమకు కల్లబొల్లి కబుర్లు చెప్పి తమ ఇంటికి తీసుకెళ్తాడు శైలేంద్ర. దేవయాని చెప్పిన మాటలకు అనుపమ బుట్టలో పడిపోతుందా? ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ఏం జరిగింది?

Guppedantha Manasu : అనుపమ ఒంటరిగా ఎందుకు ఉండిపోయింది? గతం గుర్తు చెయ్యద్దని తండ్రిని ఎందుకు వారించింది?

ధరణి బట్టలు ఐరన్ చేస్తుంటే కాఫీ కప్పుతో గదిలోకి వస్తాడు శైలేంద్ర. తండ్రి అన్న మాటలు తనని బాగా కలచివేశాయని.. తను చాలా మారిపోయానని ధరణికి చెబుతాడు. ఇకపై ధరణిని ప్రేమగా చూసుకుంటానని అంటాడు. తాను ఇన్నాళ్లు చాలా తప్పులు చేశానని, చాలా అన్యాయాలు చేశానని భార్యగా ఆమెను గుర్తించలేకపోయానని అంటాడు. శైలేంద్ర మాటలకు ఆశ్చర్యపోతుంది ధరణి. అక్కడికి వచ్చిన ఫణీంద్ర తాను ఈ మార్పే శైలేంద్రలో చూడాలనుకున్నది అంటాడు. బాధలో ఉన్నట్లు నటిస్తున్న దేవయానిని ఏమైందని అడుగుతాడు ఫణీంద్ర. జగతి చావు వెనుక మా హస్తం ఉందా? అని అడగటం చాలా బాధ పెట్టింది అంటుంది దేవయాని. నాకు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్ధం కావట్లేదు అంటాడు ఫణీంద్ర.. నువ్వు కూడా మారడానికి ప్రయత్నం చేయి అని దేవయానికి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Guppedantha Manasu 1

Guppedantha Manasu 1

అనుపమ జగతి విషయంలో అడిగిన మాటలు గుర్తొచ్చి మహేంద్ర ఆవేశంలో మందు తాగాలని బాటిల్ తీస్తాడు. అక్కడికి వచ్చిన రిషి బాటిల్ లాక్కుంటాడు. అనుపమకు చెప్పాల్సిన నిజాలు తాను చెప్పానని మీరు మళ్లీ ఎందుకు బాధపడుతూ మందు తాగాలని అనుకుంటున్నారని తండ్రిని అడుగుతాడు. జగతిని మర్చిపోలేకపోతున్నానని ఎవరి మాట విననని మందు తాగటానికి ప్రయత్నిస్తాడు మహేంద్ర. మీరు మందు తాగితే నా ఆయుష్షు తాగినట్లే అని తండ్రితో అంటాడు రిషి. రిషి మాటలకు మహేంద్ర షాకవుతాడు. తల్లి చనిపోయిన బాధ తనకు ఉందని తాగుడే బాధకు ఓదార్పు అయితే మందు చాలు అంటాడు. ఎప్పుడూ తాగనని తనపై ఒట్టేయమని మహేంద్రని అడుగుతాడు రిషి. కొడుకు మాట కాదలేక ప్రామిస్ చేస్తాడు మహేంద్ర. కాలేజీకి కూడా వస్తానని అంటాడు.

Guppedantha Manasu : జగతి చనిపోయిందని తెలిసి షాకైన అనుపమ..ఓల్డ్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్‌లో భారీ ట్విస్ట్

అనుపమ రిషి, వసుధరలను కలవడానికి కాలేజీకి వస్తుంది. అక్కడ అనుపమని చూసిన శైలేంద్ర తల్లి దేవయానికి ఫోన్ చేసి అనుపమ కాలేజీకి వచ్చిందని చెబుతాడు. ఆమెను వెంటనే ఇంటికి తీసుకురమ్మని చెబుతుంది దేవయాని. తనను అనుపమకి పరిచయం చేసుకున్న శైలేంద్ర రిషి, వసుధరలు కాలేజీకి రావడానికి ఆలస్యమవుతుందని ఈలోపు తమ ఇంటికి రమ్మని దేవయానితో ఫోన్ చేయిస్తాడు. దేవయాని మాట కాదనలేక.. జగతి గురించి కూడా తెలుసుకోవాలని అనుపమ శైలేంద్ర వెంట వెడుతుంది. దేవయాని ధరణిని పిలిచి అనుపమకి కాఫీ తీసుకురమ్మని పురమాయిస్తుంది.

Guppedantha Manasu 2

Guppedantha Manasu 2

జగతి ఇంటికి రావడం..మళ్లీ బయటకు వెళ్లిపోవడం దగ్గర నుంచి జగతి చనిపోవడం వరకు దేవయానిని అన్ని వివరాలు అడుగుతుంది అనుపమ. ఒకప్పుడు నచ్చని జగతి ఆ తర్వాత మీకు ఎలా నచ్చిందని ప్రశ్నిస్తుంది. జగతి గురించి చాలా మంచిగా చెబుతూ నటిస్తుంది దేవయాని. తన కోడలు ధరణి గురించి కూడా చాలా గొప్పగా చెబుతుంది. శైలేంద్రని నువ్వు ఎప్పుడూ ఎండీ సీటు కోరుకోలేదా? అని అడుగుతుంది. తను కోరుకోలేదని.. అంత పెద్ద బాధ్యత మోయలేనని నటిస్తూ చెబుతాడు శైలేంద్ర. ఎండీ సీటులో కూర్చున్న దగ్గర నుంచి జగతికి కష్టాలు ఎదురయ్యాయని.. ఆ కుట్రలకే జగతి బలైందని దేవయాని చెబుతుంటే అనుపమ వింటూ ఉండిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంతే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఎదురుచూడాల్సిందే. ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్ ను కాపుగంటి రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.