Guppedantha Manasu : అనుపమ ఒంటరిగా ఎందుకు ఉండిపోయింది? గతం గుర్తు చెయ్యద్దని తండ్రిని ఎందుకు వారించింది?

జగతి చనిపోయిన విషయం తెలిసి అనుపమ కన్నీరు పెట్టుకుంటుంది. తన తండ్రి విశ్వనాథం దగ్గర జగతిని తల్చుకుని బాధపడుతుంది. మహేంద్ర విషయంలో అంటూ.. గతం గుర్తు చేయబోయిన తండ్రిని వద్దని వారిస్తుంది అనుపమ.. అసలు అనుపమ గతం ఏంటి? ఆమె ఒంటరిగా ఎందుకు ఉండిపోయింది?

Guppedantha Manasu : అనుపమ ఒంటరిగా ఎందుకు ఉండిపోయింది?  గతం గుర్తు చెయ్యద్దని తండ్రిని ఎందుకు వారించింది?

Guppedantha Manasu

Updated On : November 15, 2023 / 11:25 AM IST

Guppedantha Manasu : జగతి చనిపోయిన విషయం అనుపమకి రిషి చెబుతుంటే విశ్వనాథం, ఏంజెల్ విని షాకవుతారు. గతం గుర్తు చేయబోయిన తండ్రి విశ్వనాథాన్ని అనుపమ వద్దని వారిస్తుంది. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ఏం జరిగింది?

జగతి చనిపోయిందన్న విషయం తనకెందుకు చెప్పలేదని మహేంద్రని నిలదీస్తుంది అనుపమ. నువ్వే చంపేశావా? అని కాలర్ పట్టుకుని అడుగుతుంది. నీ ప్రేమ దక్కనీయకుండా నువ్వే చంపేశావని నిందిస్తుంది. రిషి కలగజేసుకుని జగతి ఎలా చనిపోయిందో అనుపమకి చెబుతాడు. జరిగినదాంట్లో తండ్రి మహేంద్ర తప్పేమి లేదని తన తల్లిని అపురూపంగా చూసుకున్నారని అంటాడు. తమ తలరాత అడ్డం తిరిగిందని అంటాడు. రిషి మాటలు విన్న అనుపమ కుప్పకూలిపోతుంది. ఇదంతా విన్న విశ్వనాథం, ఏంజెల్ కూడా షాకవుతారు. అప్పటివరకు రిషి, వసుధరలను తనెంతగా అపార్ధం చేసుకుందో ఏంజెల్‌కి కూడా అర్ధమవుతుంది. రిషి, వసుధర, మహేంద్రలు అక్కడి నుంచి బయలుదేరతారు.

Deepika Padukone : అవును బాలీవుడ్‌లో నెపోటిజం ఉంది.. దీపికా పదుకొనే సంచలన కామెంట్స్..

కారుని మధ్యలో ఆపమంటాడు మహేంద్ర. కారు దిగి జగతిని తల్చుకుని బిగ్గరగా ఏడుస్తాడు. జగతి చావుకి తనే కారణమని అనుపమ నిలదీయటాన్ని తట్టుకోలేకపోతున్నానని అంటాడు. అసలు అనుపమ ఎవరు?.. జగతి విషయంలో ఆమె ఎందుకు అంత బాధపడుతున్నారని? రిషి మహేంద్రని అడుగుతాడు. అనుపమ, జగతి తను క్లోజ్ ఫ్రెండ్స్ అని అనుపమ జగతిని కంటికి రెప్పలా చూసుకునేదని మహేంద్ర చెబుతాడు. తమ ప్రేమకి అనుపమ ఎంతో సపోర్ట్ చేసిందని అంటాడు. ఇక నుంచి అనుపమ తనను ఎలా ట్రీట్ చేస్తుందో అని బాధపడతాడు. మీ స్నేహానికి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది బాధపడకండి అంటూ తండ్రికి నచ్చ చెప్పి అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్తాడు రిషి.

 

Guppedantha Manasu latest

Guppedantha Manasu latest

అనుపమ ఒంటరిగా కూర్చుని జగతిని తల్చుకుని బాధపడుతుంది. గదిలోకి వచ్చిన విశ్వనాథం, ఏంజెల్‌ని చూసి తన మనసేం బాగాలేదని.. ఒంటరిగా వదిలేయమని అంటుంది. రిషి వాళ్లు చెబుతుంటే మొత్తం విన్నానని అంటాడు విశ్వనాథం. ఓల్డ్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ చేసిందే జగతిని కలవడం కోసమని.. తను లేదన్న విషయం తట్టుకోలేకపోతున్నానని తండ్రికి చెబుతుంది అనుపమ. జగతి చనిపోయిందన్న విషయం ప్రాణ స్నేహితురాలినైన తన దగ్గర మహేంద్ర ఎందుకు దాచిపెట్టాడో తనకి అర్ధం కావట్లేదని ఆవేదన చెందుతుంది. జగతిని చంపిన వ్యక్తిని పట్టుకోకుండా వీళ్లేం చేస్తున్నారు అంటుంది. రిషి దేనిని అంత తేలిగ్గా తీసుకోడని అంటుంది ఏంజెల్. రిషి గురించి నీకేం తెలుసు అని అడుగుతుంది అనుపమ. జగతితో గతంలో రెండు రోజులు ఉన్నప్పుడు  వాళ్ల కుటుంబం గురించి తనకు తెలిసింది అంటుంది ఏంజెల్. జగతి పక్కన లేకపోవడంతో మహేంద్ర చాలా మారిపోయాడని అంటూ విశ్వనాథం.. ఆ.. మహేంద్ర వల్లే కదా.. అంటూ గతం గుర్తు చేయబోతాడు.

 

Guppedantha manasu today episode

Guppedantha manasu today episode

గతం గుర్తు చేయాలనుకున్న తండ్రిని వద్దని వారిస్తుంది అనుపమ. ఆ విషయాలు వదిలేయమని.. వాటిని గుర్తు చేసుకుని ఏం లాభం లేదని అంటుంది. అసలేం జరిగిందని విశ్వనాథంని ఏంజెల్ అడుగుతుంది. రిషి విషయంలో నీకు ఎదురైన అనుభవమే మీ అత్త విషయంలో కూడా జరిగింది అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జగతిని ఎవరు చంపేశారో అన్నీ తెలుసుకుంటానని అప్పటివరకు నిద్రపోనని అంటుంది అనుపమ. మరోవైపు కిచెన్‌లో వంట చేస్తున్న రిషిని చూసి వసుధర ఆశ్చర్యపోతుంది. వద్దని వారిస్తుంది. వారిద్దరి చిలిపి సంభాషణతో ఈ ఎపిసోడ్ ముగిసింది.. నెక్ట్స్ ఏం జరగబోతోంది.. రాబోయే ఎపిసోడ్ వరకు ఎదురుచూడాల్సిందే. ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ గుప్పెడంత మనసు’ సీరియల్‌ను కాపుగంటి రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.