International kissing day 2023
International kissing day 2023 : ముద్దు అనేది ఒక ఎమోషన్. ఎదుటివారిపై తమను ఉన్న ప్రేమను వ్యక్తం చేయటానికి ముద్దు పెడుతుంటారు. భార్యాభర్తలు, ప్రేమికులు, స్నేహితుల మధ్య ప్రేమ, అభిమానం, ఆప్యాయత,అనోత్యను తెలిపేందుకు ముద్దు ఒక అద్భుతమైన సాధనం. ‘ముద్దు’కు ప్రత్యేకంగా ఓ రోజు ఉంది. అది జాతీయ ముద్దు దినోత్సవం.. అంతర్జాతీయ ముద్దు దినోత్సవం. నేషనల్ కిస్సింగ్ డే జూన్ 22 అయితే ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే (International kissing day) జులై 6 (July 6th)న జరుపుకుంటారు.
ఈ చుంబన దినం యూకేలో అంటే గ్రేట్ బ్రిటన్ లో మొదలైంది. అదే అమెరికాలో నేషనల్ కిస్సింగ్ డే (US National Kissing day) జూన్ 22న జరుపుకుంటారు. ముద్దు పెట్టుకోవడం కేవలం లైంగిక చర్యకు, ఇతర కార్యకలాపాలకు ముందడుగుగా కాకుండా, మానవ బంధాలను మరింత బలపరచేందుకు ముద్దు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. ఒకరికి ఇచ్చే ముద్దు వారి మధ్య ఆత్మీయానుబంధాలను పెంచేదిగా ఉంటుంది.
International kissing Day 2023 : ముద్దుల్లో రకాలు .. వాటి అర్థాలు వెరీ ఇంట్రెస్టింగ్..
బ్రిటన్ (Britain)లో ఈ అంతర్జాతీయ చుంబన దినం (International kissing day) మొదలైంది. అది ప్రపంచం మొత్తానికి చేరింది. పాకింది. అమెరికాలో మాత్రం జూన్ 22న జరుపుకుంటారు. ఈరోజు అమెరికన్లు తమ తనివితీరా ముద్దులు పెట్టుకుంటారు. ముఖ్యంగా ప్రేమికులు.
ముద్దుల చరిత్ర.. రోమన్ల ముద్దుల తీరే వేరయా..
ప్రేమకే కాకుండా అనుబంధాలకు ప్రతీక అయిన ముద్దుకు పెద్ద చరిత్రే (kisses history) ఉంది. ముద్దు వెనుక ఆశ్చర్యకర విషయాలున్నాయి. మొట్టమొదట క్రీస్తుపూర్వం 1500 కాలం నుంచి ఈ ముద్దులు పెట్టుకోవడం ఉందని కొన్ని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. మొట్టమొదట క్రీస్తు పూర్వం 326లో ది గ్రేట్ అలెగ్జాండర్ కాలం నుంచి ఈ ముద్దుల పరంపరం ఉందని తెలుస్తోంది. అలెగ్జాండర్ అంటే గ్రీకు వీరుడు. రోమన్లు మంచి రొమాన్స్ ఉన్నవారని అంటుంటారు. పురుషుల మంచి శరీర సౌష్టవం గలవారు. దేహధారుఢ్యంతో ఆరు అడుగుల అందగాళ్లు రోమన్ పురుషులు. అందుకేనేమో కండలు తిరిగిన మగవారిని గ్రీకు వీరుడు అంటారు. ఆరు అడుగుల పొడుగుతో ఆకట్టుకునే రూపం ఉన్న మగవారిని గ్రీకు శిల్పంలా ఉన్నాడని అంటుంటారు.
అలాంటి రోమన్లు మంచి రొమాన్స్ ఉన్నవారని కూడా అంటారు. అందుకేనేమో రోమన్లు ముద్దులంటే ప్రాణం పెట్టేవారట.. రోమన్ శిల్పాలను చూస్తే అర్థమవుతుంది వారు ముద్దుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో. రోమన్ శిల్పాల్లో చాలా వరకు పురుషుడు, స్త్రీ ముద్దు పెట్టుకున్నట్లుగా ఉంటాయి. ముద్దు సమయంలో వారి శరీర భంగిమలు కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నట్లుగా గుర్తించొచ్చు.
వేదాలకు పుట్టినిల్లుగా భావిస్తున్న భారత సంస్కృత సాహిత్యంలోని ప్రధాన గ్రంథాల్లోనూ ముద్దుల ప్రస్తావన ఉంది. 1500 బీసీ కాలంలో కూడా ముద్దుల ప్రస్తావన ఉంది. ఆ కాలంలో ముక్కును ముక్కుతో రుద్ది (ఎస్కిమో ముద్దు) ద్వారా తమ ప్రేమను పంచుకునేవారని.. అది ముక్కుని జారి ముద్దు.. పెదవులపైకి జారి ఉండొచ్చని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన మానవ శాస్త్రవేత్త వాన్ బ్రయంట్ భావించారు. అలాగే ముద్దు సంస్కృతి గురించి అడిగితే ఎక్కువ మంది రోమ్ వైపే చూస్తారు. వేల ఏళ్ల క్రితం అక్కడ ముద్దు ప్రభంజనం మొదలైందని అంటారు.
International kissing day 2023 : ముద్దులు .. ఆరోగ్య ప్రయోజనాలు, మానసిక, శారీరక ఆరోగ్యాల రహస్యాలు
ముద్దులపై అధ్యయన శాస్త్రం
ఈ ముద్దులపై అధ్యయనాలు (study)కూడా జరిగాయి అంటే ముద్దులకు ఉండే ప్రత్యేకత, ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలా ముద్దులపై చేసే అధ్యయన శాస్త్రం పేరు ‘ఫిలెమాటోలజీ (philematology) అంటారు. ఈ అధ్యయనాల ప్రకారం.. ముద్దులతోనే బంధం ప్రేమ బలపడుతుందని.. దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు.. ముద్దుతో ప్రేమానుబంధాలను పెంచుకోవాలని సూచిస్తున్నారు. ముద్దుల వల్ల అనేక ప్రయోజనాలున్నాయని చాలా అధ్యయనాల్లో తేలింది. ముద్దులు పెట్టుకోవడం వల్ల కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ముప్పును తగ్గించుకోవచ్చని వెల్లడైంది.
ముద్దుతో రోగ నిరోధక శక్తిని పెరుగుతుందని కూడా అధ్యయనాల్లో తేలింది. ఒత్తిడి, ఆందోళనలను తలనొప్పిని తగ్గిస్తుంది ముద్దు. హైబీపీని కంట్రోల్ చేస్తుంది. ముద్దు శరీరంలో కాలరీలను కరిగిస్తుంది. అధిక బరువును తగ్గిస్తుంది. ముద్దు వల్ల ముఖాల కండరాల్లో కదలిక వస్తుంది. కేలరీలను కరిగిస్తుందని.. ఒత్తిడికి తగ్గటంతో ఆయుష్షును పెంచుతుందని తేలింది. ఇవన్నీపలు సర్వేల్లో నిరూపించబడ్డాయి.