Pregnancy tourism : ఆ గ్రామాల్లో అందగాళ్లు..వారితో పిల్లల్నికనటానికి విదేశీలనుంచి మహిళలు వస్తారట..!!

Pregnancy tourism : ఆ గ్రామాల్లో అందగాళ్లు..వారితో పిల్లల్నికనటానికి విదేశీలనుంచి మహిళలు వస్తారట..!!

ladakh Pregnancy tourism : లద్ధాఖ్ అంటేనే అందం. ప్రకృతికి ప్రాణం పోసినట్లు సోయగాలు కనువిందు చేస్తుంటాయి. అటువంటి లద్ధాక్ లోని సింధూ నది ఒడ్డున కొన్ని గ్రామాలు ఉంటాయి. అందమైన ఆ గ్రామాల్లో అంతకంటే అందమైన ఆజానుబాహుల్లాంటి అందగాళ్లుంటారు. పైగా వారు చక్కటి ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఆ పురుషుల అందానికి మగసిరిగా విదేశీ వనితలు మైమరచిపోతారు. వారిలాంటి అందమైన ఆజానుబాహుల్లాంటి పిల్లలు పుట్టాలని ఆకాంక్షిస్తారు. అందుకే వినటానికి కాస్త వింతగా ఉండే ‘ప్రెగ్నెన్సీ టూరిజం’ లద్ధాఖ్ గ్రామాల్లో పెరుగుతోంది. ఆ అందగాళ్లతో కలిసి దాంపత్య సుఖాలను అనుభవించి పిల్లల్ని కనటానికి విదేశీ వనితలు వస్తుంటారు.

తమకు అంత అందమైన పిల్లలు పుట్టాలని ఎంతోమంది విదేశీ అమ్మాయిలు ఈ లద్ధాఖ్ లోని గ్రామాలకు వచ్చి అమ్మలుగా మారుతున్నారు. ఈ అందమైన ఆకాంక్షలు ప్రస్తుతం ఇది మంచి బిజినెస్‌గా మారింది. మొదట్లో విదేశీ మహిళలు బ్రోక్పా జాతికి చెందిన మగవారితో ‘మీతో శృంగారంలో పాల్గొనాలని ఉంది’ అని అడిగినప్పుడు వాళ్లు తెగ సంబరపడిపోయేవారట. అలా వచ్చిన విదేశీ వనితలు నెలల తరబడి అక్కడే ఉండేవారట. ఇది 2000 సంవత్సరంనుంచే మొదలైంది. కానీ ఆ విషయం బైటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారనే వాదన కూడా ఉంది. ఆ అందమైన మోజు పెరగటంతో ఇప్పుడది అక్కడ బిజినెస్‌గా మారింది. ఆ బిజినెస్సే ‘ప్రెగ్నెన్సీ టూరిజం’ వినటానికి చాలా కొత్తగా ఉంది కదూ.

ఈ అందగాళ్ల వెనుక ఉన్న చరిత్ర వివరాల్లోకి వెళితే…పురాణాల్లో ఆర్యుల గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆర్యులు ఆజానుబాహులని, మంచి అందగాళ్లని..చక్కటి ఆరోగ్యవంతులనే పేరుంది. అటువంటి ఆర్యుల జాతి ఇంకా భూమి మీద ఎక్కడైనా ఉందా అంటే లద్దక్ ప్రాంతంలోని కొన్ని గ్రామంలో ఉన్నారట. అందుకే వారితో పిల్లలను కనేందుకు యూరప్ నుంచి మహిళలు తరలి వస్తుంటారు. ఆర్యుల వంటి అందగాళ్లు పుట్టాలని విదేశీ వనితలు ఇక్కడకు క్యూ కడుతుంటారు. ఆ ప్రాంతంలోని పురుషులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి మరీ వారితో గర్భవతులవుతారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉండే చాలామంది ఆర్యుల్లో అసలైన ఆర్యుల తెగ ఒకటి భారతదేశంలో ఉంది. అదే బ్రోక్పా తెగ. వీరిని నిజమైన ఆర్యులు అంటారు. ఆర్యులకు నీలిరంగు కళ్లుంటాయని అందుకే విదేశీ వనితలు ఇక్కడికొచ్చి గర్భం దాలుస్తారని అంటారు. అలాగే భారత్ లో ఉండే ఈ ఆర్యుల్లో కూడా నీలిరంగు కళ్లు, పసిమి ఛాయ ఉంటాయి. అలాగే వీరు ఇతరులతో పోల్చుకుంటే పొడవుగా, దృఢంగా ఉంటారు. వీరంతా అలెగ్జాండర్ సైన్యానికి చెందిన వారని కొన్ని పరిశోధనల్లో కూడా తేలింది. అలెగ్జాండర్ అంటే అందం..రాజసం..మగసిరి కలిగిన యోధుడనే విషయం తెలిసిందే.

అలెగ్జాండర్ భారతదేశంపై దండెత్తినప్పుడు అతని కొంత సైన్యం ఇక్కడే చిక్కుకుపోయిందని..వీరి సంతతి ఇప్పటికీ లడక్‌లో ఉంటోందని చరిత్ర నిపుణులు అంటారు. వాళ్లంతా తాము ఆర్యజాతికి చెందిన వారమని బ్రోక్పా జాతివారు చెప్పుకుంటూ ఉంటారు. ఆర్యులకు సంబంధించిన లక్షణాలు బ్రోక్పా తెగవారిలో చాలా స్పష్టంగా కనిపించటంతో నమ్మాల్సిందే. అంత దగ్గర పోలికలుంటాయి. అచ్చుగుద్దినట్లుగా. వారి వేషధారణ, ప్రవర్తన, మాటతీరు అన్నింటిలోనూ ఆర్యుల లక్షణాలు ఉట్టిపడతాయి. బ్రోక్పా తెగకు చెందినవారు లడక్‌లోని నాలుగు గ్రామాల్లో మాత్రమే ఉన్నారు. చరిత్రకారుల లెక్కల ప్రకారం కేవలం 1900 మంది బ్రోక్పా తెగకు చెందినవారు మాత్రమే ఉన్నారు.

ప్రస్తుతం వీరి గ్రామాలకు చాలా మంది సందర్శకులు వస్తుంటారు. ప్రత్యేకించి యూరోపియన్ అమ్మాయిలు ఈ గ్రామాల్లో పర్యటించి బ్రోక్పా జాతివారిపై చాలా పరిశోధనలు చేశారు. వీరు స్వచ్ఛమైన ఆర్యుల సంతతి వారని నిర్ధారించారు. దీంతో ఇక్కడి మగవారితో శృంగారంలో పాల్గొని ఆర్యజాతికి చెందిన బిడ్డకు జన్మనివ్వాలనే కోరిక యూరప్ కు చెందిన విదేశీ వనితల్లో బాగా పెరిగింది.

ఈక్రమంలో జర్మనీ, ఆస్ట్రియా, ఫ్రాన్స్ దేశాలకు చెందిన యువతులకు ఎక్కువగా ఈ గ్రామాలకు వచ్చి గర్భం దాల్చి పిల్లలను కంటున్నారు. వీరి సంతానానికి తండ్రితో సంబంధం లేదు.దాన్ని వాళ్లు పెద్దగా పట్టించుకోరుకూడా. కేవలం తమ పిల్లలు స్వచ్ఛమైన ఆర్యుల్లా తెలివైనవారుగా, అందమైనవారిగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు.

అందుకే చాలామంది విదేశీ అమ్మాయిలు ఈ లద్ధాక్ ప్రాంతంలోని గ్రామాలకు వచ్చి అమ్మలుగా మారుతున్నారు. ఈ అందగాళ్ల మోజు విదేశీ వనితల్లో పెరగటంతో ప్రస్తుతం ఇది మంచి బిజినెస్‌గా మారింది. ఇక్కడ అబ్బాయిలు శృంగారంలో పాల్గొనడానికి డబ్బును డిమాండ్ చేస్తున్నారు. దానితో ఇప్పుడు అది ‘‘ప్రెగ్నెన్సీ టూరిజం’’గా మారింది. అదికాస్తా ఇప్పుడు ‘‘పెయిడ్ ప్రెగ్నెన్సీ టూరింజం’’గా మారి విదేశీ వనితల రాకలతో సందర్శకులతో కళకళలాడుతోంది.