International kissing day 2023 : ముద్దులు .. ఆరోగ్య ప్రయోజనాలు, మానసిక, శారీరక ఆరోగ్యాల రహస్యాలు
ముద్దు ప్రేమ, ఆప్యాయతకు, వాత్సల్యానికి చిహ్నమే కాదు అటువంటి ముద్దు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ముద్దు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

health benefits of kissing
international kissing day 2023: ముద్దు ఒక మధురమైన అనుభూతి. అటువంటి ముద్దు శరీరక,మానసికంగా శరీరక ఆరోగ్యాన్ని కలిగిస్తుందనే విషయం మీకు తెలుసా?.శరీరాన్ని తాకిన ముద్దు మనస్సుపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉన్నట్లే..అంటే మానసిక ఒత్తిడి శరీరంపై ఎటువంటి దుష్ప్రభావాలు చూపుతుందో మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరంకూడా అంత ఆరోగ్యంగా ఉంటుంది. అంటే శరీరానికి మనస్సుకు ఎంతటి బంధం సంబంధం ఉందో అర్థం చేసుకోవచ్చు.ముద్దు అనుభూతి కూడా మనస్సు పై తద్వారా శరీరంపై అటువంటి ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒక్క ముద్దు శరీరంలోని రెండు మూడు కాలరీలు బర్న్ అయ్యేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలా ముద్దుల వల్ల బరువు తగ్గొచ్చని చెబుతున్నారు. అధ్యయాల్లో వెల్లడైన ముచ్చటైన ముద్దు ఫలితాలివి. సాధారణ ముద్దుతో రెండు నుంచి మూడు కాలరీలు బర్న్ అవుతాయని అదే ఉద్వేగపూరితమైన గాఢమైనముద్దుతో నిమగ్నమైతే నిమిషానికి ఐదు నుంచి ఆరు కాలరీలు బర్న్ అవుతాయని తెలిపారు. అటువంటి ముద్దు మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందన్న ముచ్చట ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి..
ముద్దు ప్రేమ, ఆప్యాయతకు, వాత్సల్యానికి చిహ్నమే కాదు అటువంటి ముద్దు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ముద్దు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముద్దు మానసిక ఆందోళననలను తగ్గిస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. హై బీపీని కంట్రోల్ చేస్తుంది. టెన్షన్ పెరిగితే హై బీపీ పెరుగుతుంది. అలా హైబీపీని ఒక్క ముద్దు కంట్రోల్ చేస్తుంది. ముద్దులోని మధురిమ అటువంటిది. అటువంటి ముద్దు గురించి ముద్దు ముద్దు విషయాలు ఏంటో..ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
International kissing Day 2023 : ముద్దుల్లో రకాలు .. వాటి అర్థాలు వెరీ ఇంట్రెస్టింగ్..
మీరు ఎవరినైనా ముద్దు పెట్టుకున్నారనుకోండీ..అప్పుడు మీ మెదడు ఆక్సిటోసిన్, డొపామైన్, సెరోటోనిన్ వంటి రసాయనాలను విడుదల చేయడానికి ప్రేరేపించబడుతుంది. ఆ రసాయనాల విడుదలతో మీరు సంతోషంగా, ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. మానసిక ఒత్తిడిని కలిగించే మీ కార్టిసాల్ స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. ఆ సంతోషకరమైన హార్మోన్లు మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. తద్వారా మనస్సుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది.
అంతేకాదు ముద్దు కార్టిసాల్ స్థాయిలను తగ్గించడానికి చక్కటి సపోర్టుగా ఉంటుంది. ఈ కార్డిసాల్ ఒత్తిడిని కలిగిస్తుంది. ముద్దు కార్డిసాల్ స్థాయిలను తగ్గించి మీ ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇది యాంగ్జైటీని కూడా తగ్గిస్తుంది. తద్వారా ప్రశాంతత కలిగిస్తుంది.
మీరు ముద్దు పెట్టుకున్నప్పుడు లాలాజలం (Saliva) స్రవిస్తుంది. కాబట్టి కావిటీస్ కు దారితీసే మీ దంతాలపై ఫలకాన్ని పోగొడుతుంది. లాలాజలం మీ దంతాలకు అంటుకున్న కుహరం కలిగించే కణాలను తొలగించడానికి చక్కగా ఉపయోగపడుతుంది.అంటే ముద్దు నోటి శుభ్రతకు కూడా ఉపయోగపడుతుందన్నమాట. శుభ్రతతో పాటుమంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. లాలాజలం స్రావం మంచి బ్యాక్టీరియా మార్పిడికి కూడా దారితీస్తుంది. అలాగే అంటువ్యాధులతో పోరాడే మీ రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని బలోపేతం చేసే సూక్ష్మక్రిములను కూడా మార్పిడీ చేస్తుంది.
మరి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ముద్దు గురించి తెలిస్తే భలే ముద్దుగా అనిపించకమానదు కదా..ఏమంటారు? ముద్దును ముద్దుగానే చూడాలి..అశ్లీలతగా కాదు. ఎన్నో రకాల ముద్దులు..మరెన్నో రకాల అర్థాలను చాటి చెబుతున్నాయి. ప్రేమ, ఆప్యాయత, గౌరవం, పరిచయం, మేమున్నామనే నమ్మకం వంటివే కాదు వీటన్నింటిని మించి ఈ ప్రపంచంలో మనస్సులోని భావాలను వ్యక్తం చేసే ఓ గొప్ప సాధనం. ముద్దుతో మధురానుభూతులే కాదు ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే ఈ ముద్దుల దినోత్సవం చాలా చాలా ముద్దొచ్చే విషయాలను చాటిచెబుతోందనే విషయాన్ని గుర్తించాలి.