International Lefthanders Day: ఎడమ చేతివాటం వారు ఎక్కువగా ఉన్న దేశం ఏది? చైనాలో మరీ ఇంత తక్కువగా ఎందుకున్నారో తెలుసా?

ఎడమ చేతివాటం వారిని చైనాలో ఎగతాళి చేస్తారని, కొన్ని చోట్ల వేధిస్తారని...

International Lefthanders Day: ఎడమ చేతివాటం వారు ఎక్కువగా ఉన్న దేశం ఏది? చైనాలో మరీ ఇంత తక్కువగా ఎందుకున్నారో తెలుసా?

International Lefthanders Day - 2023

International Lefthanders Day – 2023: ప్రపంచం ఆగస్టు 13న ఎడమ చేతివాట దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ప్రపంచంలో, ప్రతి 10 మందిలో ఒకరు ఎడమచేతి వాటం ఉన్నవారే. ప్రపంచంలోని పలు దేశాల్లో ఎడమ చేతివాటంపై చేసిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు తెలిశాయి. leftyfretz.comలో ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు.

ఎడమ చేతివాటం వారి గురించి అన్ని అంశాలనూ ఆ వెబ్‌సైట్‌లో పొందుపర్చుతారు. ప్రపంచంలో ఎడమచేటివాటం మనుషులు అత్యధికంగా ఉన్న దేశాల్లో నెదర్లాండ్స్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో కెనడా ఉంది. పరిశోధనలు జరిగిన పెద్ద దేశాల్లో అన్నింటి కన్నా చైనాలో అత్యల్పంగా ఎడమ చేతివాటం (3.5 శాతం) మనుషులు ఉన్నారు.

చైనాలో ఇంత తక్కువగా ఎడమ చేతివాటంవారు ఎందుకు ఉన్నారన్న విషయంపై కూడా పరిశోధకులు స్పష్టతనిచ్చారు. ఎడమ చేతివాటం వారిని కాస్త హీనంగా చూసే సంస్కృతి చైనాలో ఉంది.

దీంతో ఎవరూ ఎడమ చేతివాటానికి అలవాటు పడాలని అనుకోవడం లేదు. పిల్లలు ఎడమ చేతివాటానికి అలవాటు పడుతున్నారని తెలిస్తే పెద్దలు ఆ అలవాటుని మార్పించే ప్రయత్నం చేస్తారు. ఎడమ చేతివాటం వారిని చైనాలో ఎగతాళి చేస్తారని, కొన్ని చోట్ల వేధిస్తారని, అటువంటి వారిని సాధారణ వ్యక్తిలా చూడరని పరిశోధనల్లో గుర్తించారు.

ఎడమచేతి వాటం వాళ్లు ఎక్కువగా ఉన్న దేశాలు

నెదర్లాండ్స్ (13.23%)
అమెరికా (13.10%)
కెనడా (12.80%)
యూకే (12.24%)
ఫ్రాన్స్ (11.15%)
జర్మనీ (9.83%)
స్పెయిన్ (9.63%)
భారత్ (5.20%)
జపాన్ (4.70%)
చైనా (3.50%)

International Lefthanders Day: ఎడమ చేతితో ప్రపంచం అబ్బురపడే విజయాలు సాధించింది వీరే..