కేటీఆర్ సార్..’నా కొత్త జాబ్ ఎలా ఉంది’ 

హరో రామ్ చరణ్ తేజ భార్య  ఉపాసన కామినేని కేటీఆర్ కు పెట్టిన ట్వీట్ వైరల్ ..వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశం నిమిత్తం దావోస్‌ వెళ్లాను. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి సమాచారం అందించేందుకు ఇక్కడి ఇన్వెస్ట్‌‌ తెలంగాణ డెస్క్‌లో కూర్చున్నాను'. 'నా కొత్త జాబ్ ఎలా ఉంది కేటీఆర్‌ సర్‌?

  • Published By: veegamteam ,Published On : January 25, 2019 / 03:47 AM IST
కేటీఆర్ సార్..’నా కొత్త జాబ్ ఎలా ఉంది’ 

హరో రామ్ చరణ్ తేజ భార్య  ఉపాసన కామినేని కేటీఆర్ కు పెట్టిన ట్వీట్ వైరల్ ..వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశం నిమిత్తం దావోస్‌ వెళ్లాను. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి సమాచారం అందించేందుకు ఇక్కడి ఇన్వెస్ట్‌‌ తెలంగాణ డెస్క్‌లో కూర్చున్నాను’. ‘నా కొత్త జాబ్ ఎలా ఉంది కేటీఆర్‌ సర్‌?

దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు
ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్ సమన్వయకర్తగా ఉపాసన
రిసెప్షన్ లో కూర్చున్న ఫోటో వైరల్
దావోస్ సదస్సుకు నారా బ్రాహ్మణి, లోకేశ్ 

హైదరాబాద్: హరో రామ్ చరణ్ తేజ భార్య  ఉపాసన జనవరి 24న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ట్వీట్ చేశారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశం నిమిత్తం దావోస్‌ వెళ్లాను. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి సమాచారం అందించేందుకు ఇక్కడి ఇన్వెస్ట్‌‌ తెలంగాణ డెస్క్‌లో కూర్చున్నాను’. ‘నా కొత్త జాబ్ ఎలా ఉంది కేటీఆర్‌ సార్‌? అంటూ ఉపాసన పెట్టిన ట్వీట్ వైరల్ గా మారింది. 

ఈ సందర్భంగా తెలంగాణ గురించి ..విశ్వనగరం హైదరాబాద్ గురించి, ఆమె ప్రస్తావిస్తూ..ప్రపంచంలోనే హైదరాబాద్  చాలా బెటర్ ప్లేస్ అనీ.. స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో హైదరాబాద్, తెలంగాణ ముందున్నాయంటూ… ఉపాసన తన ట్వీట్ లో తెలిపారు.  తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న కంపెనీలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు తనవంతు వర్క్ గా భావించిన ఉపాసన ఫోరంలోని తెలంగాణ డెస్క్‌కు కోఆర్డినేటర్‌గా వ్యవహరించారు. ఈ విషయాన్ని ఉపాసన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఉపాసన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను కలిశారు. 

ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి కూడా దావోస్ వెళ్లారు. ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులు, అధికారులు హాజరయ్యారు. లోకేష్ సతీమణి కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. మహిళా పారిశ్రామిక్వేత్తగా ఆమె హాజరయ్యారు.