Hijab Row: అమెరికా, ఇజ్రాయెల్ దేశాల కుట్ర వల్లే హిజాబ్ వివాదం.. ఇరాన్ సుప్రీం లీడర్ ఘాటు విమర్శలు

ఇరాన్‭లో ఇంత పెద్ద ఎత్తున వివాదానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కుట్ర పన్నాయని ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేని తాజాగా ఆరోపణలు గుప్పించారు.ఆ దేశాల పథకం ప్రకారమే ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు. టెహ్రాన్‌లోని పోలీస్‌ అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన అమీని మృతిని ప్రస్తావించారు. ఆ ఘటన తమనెంతో కలచివేసిందన్న ఖమేని అయినప్పటికీ, ఆ ఘటనానంతరం మొదలైన నిరసనలను మాత్రం ఖండించారు.

Hijab Row: హిజాబ్ వివాదం ఇరాన్ దేశాన్ని కుదిపివేస్తోంది. వేలాది మంది రోడ్లపైకి వచ్చి హిజాబ్ తొలగించి మంటల్లో కాలుస్తున్నారు. తమ జుట్టు కత్తిరించుకుంటున్నారు. ఇదంతా వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కాగా, ఇరాన్ ప్రభుత్వం పోలీసుల్ని ప్రయోగించిన ఈ ఆందోళనను తగ్గించే ప్రయత్నాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇరాన్‭లో ఇంత పెద్ద ఎత్తున వివాదానికి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కుట్ర పన్నాయని ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేని తాజాగా ఆరోపణలు గుప్పించారు.ఆ దేశాల పథకం ప్రకారమే ఈ ఆందోళనలు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు.

ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ‘‘పథకం ప్రకారమే ఈ అల్లర్లు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలకు ముఖ్య కారణం అమెరికా, యూదుల పాలకులు, వారి ఉద్యోగులేనని స్పష్టంగా చెబుతున్నా. ఇటువంటి ఘటనలు అసాధారణమైనవి’’ అని అయతొల్లా అలీ ఖమేని పేర్కొన్నారు. టెహ్రాన్‌లోని పోలీస్‌ అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైన అమీని మృతిని ప్రస్తావించారు. ఆ ఘటన తమనెంతో కలచివేసిందన్న ఖమేని అయినప్పటికీ, ఆ ఘటనానంతరం మొదలైన నిరసనలను మాత్రం ఖండించారు.

Liz Truss: సంపన్నుల విషయంలో యూటర్న్ తీసుకున్న ప్రధానమంత్రి

ట్రెండింగ్ వార్తలు