బాబోయ్.. లైవ్‌లో ఉండగా పేలిన బాంబు.. లేడీ యాంకర్ పరుగోపరుగు.. వీడియో వైరల్
సిరియాలో ప్రభుత్వ దళాలకు, డ్రూజ్ రెబల్ గ్రూపునకు మధ్య జరుగుతున్న ఘర్షణను ఆసరాగా చేసుకుని ఆ దేశ రాజధాని డమాస్కస్ పై ఇజ్రాయెల్ దాడులు చేసింది.

Israel Bombs on Syrias
Israel Bombs: సిరియాలో ప్రభుత్వ దళాలకు, డ్రూజ్ రెబల్ గ్రూపునకు మధ్య జరుగుతున్న ఘర్షణను ఆసరాగా చేసుకుని ఆ దేశ రాజధాని డమాస్కస్ పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. బుధవారం సిరియా రక్షణశాఖ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద, అధ్యక్ష కార్యాలయానికి సమీపంలో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపింది.
Also Read: Shubhanshu Shukla: 18 రోజుల అంతరిక్ష యాత్ర తర్వాత.. తన కుటుంబసభ్యులను కలిసి శుభాన్షు శుక్లా
డ్రూజ్ వర్గానికి ఇతరులకు మధ్య కొనసాగుతున్న వర్గపోరులో ఇజ్రాయెల్ ఇటీవల జోక్యం చేసుకుంది. డ్రూజ్‌కు మద్దతుగా ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో సిరియా రాజధానిలో బాంబుల మోత మోగింది. ఇదే క్రమంలో సిరియాలోని ఆర్మీ సహా పలు ప్రధాన కార్యాలయాలపై ఇజ్రాయెల్ దాడులు నిర్వహించింది.
అధికారిక మీడియా కేంద్రం ఉన్న భవనంపైనా ఇజ్రాయెల్ దాడులు జరిపించింది. బాంబు దాడి జరిగిన సమయంలో మహిళా యాంకర్ వార్తలు చదువుతుంది. బాంబు మోతతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన మహిళా యాంకర్.. అక్కడి నుంచి పరుగెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
החלו המכות הכואבות pic.twitter.com/1kJFFXoiua
— ישראל כ”ץ Israel Katz (@Israel_katz) July 16, 2025
బాంబు దాడితో భయాందోళనకు గురైన మహిళా యాంకర్.. స్టూడియో నుంచి పరుగెత్తిన వీడియోను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేశారు. డ్రూజ్ వర్గానికి అండగా ఉంటామని చెప్పారు.