Al Shifa Hospital weapons found
Gaza Al Shifa Hospital : గాజా నగరంలోని అల్ షిఫా ఆసుపత్రిలో హమాస్ మిలిటెంట్లు ఆయుధాలు ఉంచిందా? అంటే అవునంటోంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. గాజా అల్ షిఫా ఆసుపత్రి దిగువన సొరంగంలో హమాస్ కమాండ్ సెంటరును నిర్మించిందని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఆసుపత్రిలో నవజాత శిశువులతో సహా వేలాది మంది రోగులపై ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని ఐక్యరాజ్యసమితి, మధ్యప్రాచ్య దేశాలు ఖండించిన నేపథ్యంలో ఆటోమేటిక్ ఆయుధాలు, గ్రెనేడ్లు, మందుగుండు సామగ్రి, ఫ్లాక్ జాకెట్లను ఆసుపత్రి కాంప్లెక్స్ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వీడియోలో చూపించింది.
అల్ షిఫా హాస్పిటల్‌లో ఇజ్రాయెల్ దళం గాలింపు
గాజాలోని అల్ షిఫా హాస్పిటల్‌లో ఇజ్రాయెల్ దళం గాలింపును ముమ్మరం చేసింది. ఇజ్రాయెల్ దళాలు గురువారం కూడా గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిలో సోదాలు కొనసాగించాయి. ఆసుపత్రిలో హమాస్ ఉగ్రవాదులు దాక్కున్నారని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ ట్యాంకులు మెడికల్ కాంపౌండ్ లోపల ఉన్నాయని, సైనికులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, అత్యవసర, శస్త్రచికిత్స విభాగాల్లోకి ప్రవేశించారని ప్రవేశించారని ఆసుపత్రి వైద్యులు చెప్పారు.
గాజా సమీపంలో నెతన్యాహు పర్యటన
తాము ప్రత్యేకంగా హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకున్నామని, పౌరులను కాదని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. గాజా సమీపంలోని ఇజ్రాయెల్ దళాలను నెతన్యాహు సందర్శించారు. కాగా షిఫా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడిపై అమెరికా సంతకం చేయలేదని యూఎస్ జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ బుధవారం చెప్పారు.
ఆయుధాల వీడియో విడుదల
గాజాలోని అల్-షిఫా ఆసుపత్రిలో దొరికిన ఆయుధాల వీడియోను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ఆయుధాలు, సైనిక సామగ్రిని వెలికితీసే వీడియోను విడుదల చేసింది. అల్ షిఫా ఆసుపత్రి టన్నెళ్లలో ఇజ్రాయెల్ సైనికులు బుల్డోజర్లతో వెతుకుతున్నారు.
‘‘ఈ రాత్రి మేం షిఫా హాస్పిటల్ లక్ష్యంగా ఆపరేషన్ నిర్వహించాం. మేం ముందుకు సాగుతూనే ఉన్నాం ’’అని గాజా స్ట్రిప్‌లోని ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాల అధిపతి మేజర్ జనరల్ యారోన్ ఫింకెల్‌మాన్ సైన్యం యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌లో తెలిపారు.
ALSO READ : Legend King kohli : సెంచరీ రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ
ఇజ్రాయెల్ ఆసుపత్రి చుట్టూ బుల్డోజర్లను మోహరించినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ సేనలు ఆవరణలోకి చొరబడటంతో అన్ని విభాగాలకు నీరు, విద్యుత్, ఆక్సిజన్ నిలిపివేశారని అల్ షిఫా హాస్పిటల్ డైరెక్టర్ చెప్పారు.
Watch as LTC (res.) Jonathan Conricus exposes the countless Hamas weapons IDF troops have uncovered in the Shifa Hospital's MRI building: pic.twitter.com/5qssP8z1XQ
— Israel Defense Forces (@IDF) November 15, 2023