కసితో పోరాడింది, ఒక్కొక్కరిని మడత పెట్టేసింది.. హిజ్బులా టాప్ లీడర్లను ఖతం చేసిన ఇజ్రాయెల్..!

ఇప్పుడు హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ చేసేది ఫైనల్ యుద్ధామా? యుద్ధ భూమిలో ఇజ్రాయెల్ విజయ పతాకం ఎగురవేస్తుందా?

కసితో పోరాడింది, ఒక్కొక్కరిని మడత పెట్టేసింది.. హిజ్బులా టాప్ లీడర్లను ఖతం చేసిన ఇజ్రాయెల్..!

Updated On : September 29, 2024 / 12:34 AM IST

Israel-Hezbollah War : కవ్విస్తూ కన్ ఫ్యూజ్ కాలేదు. ఓపిక పట్టి వ్యూహం అమలు చేసింది. కసితో పోరాడింది. ఒంటరిగా యుద్ధం మొదలు పెట్టి ఒక్కొక్కరిని మడత పెడుతూ వార్ ని క్లైమాక్స్ కు తెచ్చింది ఇజ్రాయెల్. పాలస్తీనాతో స్టార్ట్ అయిన వార్ ను లెబనాన్ వరకు తెచ్చి ఉత్కంఠను పీక్స్ కు చేర్చింది. మధ్యలో వచ్చినోళ్లను వచ్చినట్లుగానే ఖతం చేస్తూ వచ్చింది. హమాస్ అయినా, హిజ్‌బొల్లా అయినా.. తెరవెనుక ఉండే కుట్రలతో దాడులు చేసే వాళ్లను వెంటాడి, వేటాడుతూ టాప్ లీడర్ల కథ ముగించేసింది. ఇప్పుడు ఏకంగా హిజ్‌బొల్లా చీఫ్ ను మట్టుబెట్టామని చెబుతోంది. హిజ్బుల్లాను ఇజ్రాయెల్ తుడిచిపెట్టేస్తోందా? మిడిల్ ఈస్ట్ వార్ లో ఇజ్రాయెల్ పైచేయి సాధించినట్లేనా? లెబనాన్, ఇజ్రాయెల్ దాడులు ముగిస్తే యుద్ధానికి శుభం కార్డు పడటం ఖాయమేనా?

Also Read : సై అంటే సై అంటున్న ట్రంప్, కమలా హారిస్.. యూఎస్ ఎన్నికల్లో గెలుపెవరిది? అధ్యక్ష రేసులో ఎవరెక్కడ?

చెబితే వినలేదు. చావుని కొని మరీ తెచ్చుకుంటున్నారు. ఇప్పటిదాకా జరిగిన యుద్ధం ఒక ఎత్తు. ఇప్పటి నుంచి మరో ఎత్తు. గతం ఏమైందో తెలియదు. ఇప్పుడు మాత్రం ఊరుకునేది లేదు. ఎలాగైతే అలా అయ్యింది. ఎందాకైనా రెడీ అంటోంది ఇజ్రాయెల్. ఏదో ఒకటి తేల్చుకోవడమే అంటూ అమెరికా మాటలను కూడా లెక్క చేయడం లేదు. అసలు లక్ష్యం నెరవేరే వరకు వెనక్కి తగ్గేదే లేదని హిజ్బుల్లా మీద తొడగొడుతోంది. ఏ బిడ్డ.. ఇది నా అడ్డా.. అంటూ ఏకంగా 80 టన్నుల బాంబులతో అటాక్ చేసి హిబ్ బొల్లా మెయిన్ చీఫ్ ను ఏసేసింది ఇజ్రాయెల్. తమ యుద్ధం లెబనాన్ ప్రజలతో కాదు హిజ్బుల్లాతోనేనని టార్గెట్ ఏంటో క్లియర్ కట్ గా చెప్పేసింది. ఇప్పుడు హిజ్బుల్లాతో ఇజ్రాయెల్ చేసేది ఫైనల్ యుద్ధామా? యుద్ధ భూమిలో ఇజ్రాయెల్ విజయ పతాకం ఎగురవేస్తుందా?

పూర్తి వివరాలు..