సై అంటే సై అంటున్న ట్రంప్, కమలా హారిస్.. యూఎస్ ఎన్నికల్లో గెలుపెవరిది? అధ్యక్ష రేసులో ఎవరెక్కడ?
బైడెన్ తప్పుకున్నాక కమలా హారిస్ నుంచి టఫ్ ఫైట్ నే ఫేస్ చేస్తున్నారు ట్రంప్. పరిస్థితి చూస్తుంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అసలు సమరం ఇప్పుడే మొదలైందా? అనే చర్చ జరుగుతోంది.

Donald Trump Vs Kamala Harris (Photo Credit : Google)
Us Elections 2024 : తగ్గేదేలే అని ఒకరు, గెలిచేది తానే అని మరొకరు.. సెంటిమెంట్ ను ఒకరు నమ్ముకుంటే, అన్నీ సెటిల్ చేస్తానంటూ మరొకరు.. నువ్వా నేనా అన్నట్లుగా అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలు హీట్ ఎక్కిస్తున్నాయి. దాడులు, మాటల యుద్ధంతో అటు ట్రంప్, ఇటు కమలా హారిస్.. ఎవరూ తగ్గడం లేదు. సర్వే రిపోర్టులతో ఇప్పటికే గెలుపు ధీమాతో ఉన్న కమల.. టీవీ డిబేట్లలోనూ ట్రంప్ కు ఇచ్చి పడేస్తున్నారు.
మరోవైపు ట్రంప్.. సెంటిమెంట్ పాలిటిక్స్ కు తెరలేపారు. లోకల్ ఫీలింగ్ ను రాజేయడంతో పాటు తనను చంపే కుట్రలు జరుగుతున్నాయని అంటూ నయా ప్రచారం మొదలు పెట్టారు. నెగ్గేందుకు ట్రంప్, నిలిచి గెలిచేందుకు కమలా హారిస్.. అన్ని అస్త్రాలను వాడుకుంటున్నారు. ఇంతకీ యూఎస్ ఎన్నికల్లో గెలుపెవరిది? ట్రంప్ నెగ్గుతాడా? కమల గెలుస్తుందా? రేసులో ఎవరెక్కడ?
Also Read : చైనాకు కొమ్ము కాస్తారా, భారత్‌తో సన్నిహితంగా ఉంటారా? శ్రీలంక కొత్త అధ్యక్షుడి భవిష్యత్ వ్యూహం ఏంటి..
ఆ ఇద్దరిదీ అంతులేని విశ్వాసం. తమ మీద తమకు నమ్మకంతో ఓడిపోతామనే ఆలోచననే దరికి చేరినివ్వడం లేదు. అధ్యక్ష పదవి తనదంటే తనదని, వైట్ హౌస్ లో కాలు మోపేది తానంటే తానని, అటు కమల ఇటు ట్రంప్ ధీమాతో ఉన్నారు. సర్వేలు ఒకవైపు దగ్గరికి వస్తున్న ఎన్నికల డేట్ ఇంకోవైపు.. రోజుకో డెవలప్ మెంట్ తో అమెరికా ఎన్నికల సమరం కొత్త టర్న్ తీసుకుంటోంది.
బైడెన్ తప్పుకున్నాక కమలా హారిస్ నుంచి టఫ్ ఫైట్ నే ఫేస్ చేస్తున్నారు ట్రంప్. పరిస్థితి చూస్తుంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అసలు సమరం ఇప్పుడే మొదలైందా? అనే చర్చ జరుగుతోంది. మాటల యుద్ధం ఇంకెంత దూరం వెళ్లనుంది? అధ్యక్ష ఎన్నికల వేళ ఈ కాల్పుల కలకలం ఏంటి?
పూర్తి వివరాలు..