Israel Hezbollah War: మళ్లీ మొదటికొచ్చింది.. ఇజ్రాయెల్, హెజ్బొల్లా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు

ఇజ్రాయెల్, హెజ్బొల్లా 60రోజుల ఒప్పందానికి బీటలువారాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని దాటి ఇజ్రాయెల్, హెజ్బొల్లా దాడులు చేసుకున్నాయి.

Israel Hezbollah War

Israel Attack On Hezbollah: ఇజ్రాయెల్, హెజ్బొల్లా 60రోజుల ఒప్పందానికి బీటలువారాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని దాటి ఇజ్రాయెల్, హెజ్బొల్లా దాడులు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 11 మంది మృతి చెందారు. అయితే, తొలుత హజ్బొల్లా ఇజ్రాయెల్ పై ప్రోజెక్లైల్స్ ప్రయోగించింది. ఇజ్రాయెల్ సైన్యమే లక్ష్యంగా హెజ్బొల్లా దాడులకు దిగడంతో అగ్నిరాజేసినట్లయింది. హెజ్బొల్లాకు దీటుగా సమాధానం చెప్పేందుకు ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించే సమయంలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెజ్బొల్లాకు హెచ్చరికలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్దంగా దాడులకు పాల్పడితే తాము తిరిగి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే.

Also Read: Israel Hezbollah Ceasefire : లెబనాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం వెనక ఇజ్రాయెల్ భారీ స్కెచ్ ఉందా?

గత వారం రోజుల క్రితం ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కాల్పుల విమరణ ఒప్పందంతో భగ్గుమంటున్న పశ్చిమాసియాలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని అందరూ భావించారు. దీనికితోడు ఇజ్రాయెల్, హెజ్బొల్లాల మధ్య 13 నెలల యుద్ధానికి ఎట్టకేలకు తెరపడినట్లైంది. రెండు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్వయంగా ప్రకటించారు. శాశ్వత కాల్పుల విరమణ లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగిందన్నారు. ఒప్పందం ప్రకారం 60 రోజుల్లో బలగాలను ఇజ్రాయెల్ వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక, అటు తమ సరిహద్దులోని భూభూగాన్ని లెబనాన్ సైన్యం నియంత్రణలోకి తీసుకుంటుంది. కానీ, కాల్పుల విరమణ ఒప్పందంకు వారం రోజుల్లోనే విఘాతం ఏర్పడటంతో ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య వివాదం మళ్లీ మొదటికొచ్చినట్లయింది.

 

Also Read: Donald Trump: ‘నేనొస్తున్నా నరకం చూపిస్తా’.. హ‌మాస్‌కు డొనాల్డ్ ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఎందుకంటే?