Donald Trump: ‘నేనొస్తున్నా నరకం చూపిస్తా’.. హ‌మాస్‌కు డొనాల్డ్ ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఎందుకంటే?

ఇజ్రాయెల్ గణాంకాల ప్రకారం.. గత సంవత్సరం ఇజ్రాయెల్ పై దాడి సమయంలో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ - అమెరికా పౌరులతోసహా 250 మందిని బందీలుగా చేసుకున్నారు.

Donald Trump: ‘నేనొస్తున్నా నరకం చూపిస్తా’.. హ‌మాస్‌కు డొనాల్డ్ ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఎందుకంటే?

Donald Trump

Updated On : December 3, 2024 / 8:16 AM IST

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 20న ఆయన అగ్రరాజ్యం అధ్యక్ష పీఠాన్ని అదిరోహించనున్నారు. ఇప్పటికే తన కార్యవర్గంలోకి కీలక వ్యక్తులను తీసుకున్నారు. వారికి పలు శాఖలకు సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. వీరంతా ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత యాక్టివ్ లోకి రానున్నారు. ఇదిలాఉంటే.. తాజాగా డొనాల్డ్ ట్రంప్ పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థకు బిగ్ వార్నింగ్ ఇచ్చారు. గాజా బందీలను వెంటనే విడుదల చేయాలని, తాను బాధ్యతలు చేపట్టక ముందే ఆ ప్రక్రియ పూర్తికావాలని, లేకుంటే నేను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత నరకం చూపిస్తా అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ భారీ హెచ్చరిక జారీ చేశారు.

Also Read: US-Ukraine: రష్యాకు బిగ్ షాకిచ్చిన జో బైడెన్.. యుక్రెయిన్‌కు అమెరికా నుంచి భారీ మిలిటరీ సాయం

ఇజ్రాయెల్ గణాంకాల ప్రకారం.. గత సంవత్సరం ఇజ్రాయెల్ పై దాడి సమయంలో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ – అమెరికా పౌరులతోసహా 250 మందిని బందీలుగా చేసుకున్నారు. గాజాలో ఇప్పటికీ 101 మంది వరకు విదేశీయులు, ఇజ్రాయెల్ ప్రజలు బందీలుగా ఉన్నట్లు, వారంతా సజీవంగా ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే, గతంలో డొనాల్డ్ ట్రంప్ గాజాలోని బందీలను విడుదల చేయాలని హమాస్ కు సూచించారు. తాజాగా హమాస్ ను హెచ్చరిస్తూ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. నేను అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే నాటికి బందీలను విడుదల చేయకుంటే నరకం చూపిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Also Read: Joe biden: బైడెన్ సంచలన నిర్ణయం.. కుమారుడికి క్షమాభిక్ష.. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే?

ఇదిలాఉంటే.. ఇటీవల హమాస్ యాక్టింగ్ గాజా చీఫ్ ఖలీల్ అల్ -హయ్యా ఇటీవల ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. పాలస్తీనా భూభాగంలో యుద్ధం ముగిసే వరకు గాజాలో బందీలను విడిచిపెట్టే ఉద్దేశం లేదని, అలాంటి పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ హమాస్ సంస్థకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ట్రంప్ వార్నింగ్ కు హమాస్ ఉగ్రవాద సంస్థ ఏ విధంగా స్సందిస్తుందో వేచి చూడాల్సిందే.

హమాస్ కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇవ్వడంపై ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జాగ్ స్పందించారు. ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు. హమాస్ బందీలుగా ఉన్న మా సోదరసోదరీమణులను స్వస్థలాలకు తిరిగివచ్చే సమయం కోసం మేమంతా ప్రార్థిస్తున్నాం అని అన్నారు.