Hollywood actress Angelina Jolie : గాజా యుద్ధంపై హాలివుడ్ నటి ఏంజెలీనా జోలీ సంచలన వ్యాఖ్యలు…దూషించిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్

గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంపై హాలివుడ్ నటి ఏంజెలీనా జోలీ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏంజెలీనా జోలీ ఇజ్రాయెల్ వ్యతిరేక వైఖరిపై తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు పెట్టారు......

Israel President Slams Angelina Jolie

Hollywood actress Angelina Jolie : గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంపై హాలివుడ్ నటి ఏంజెలీనా జోలీ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏంజెలీనా జోలీ ఇజ్రాయెల్ వ్యతిరేక వైఖరిపై తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు పెట్టారు. శరణార్థులకు సహాయం చేయడానికి ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేసిన తన అనుభవాన్ని ఆమె ప్రస్థావించారు.

Also Read : Supreme Court : బాణసంచా అమ్మకాలు,కొనుగోళ్లపై నిషేధం విధించమన్న సుప్రీంకోర్టు

‘‘ఇజ్రాయెల్‌లో జరిగింది ఒక ఉగ్ర చర్య. కానీ, గాజాలో ఎక్కడా ఆహారం లేదా నీరు అందుబాటులో లేకుండా పౌరులపై బాంబు దాడిలో అమాయకుల ప్రాణాలు కోల్పోవడాన్ని సమర్థించలేం. ఆశ్రయం పొందేందుకు సరిహద్దును దాటడం ప్రాథమిక మానవ హక్కు. ఇజ్రాయెల్ వైమానిక దాడుల ఫలితంగా గాజా సామూహిక సమాధిగా మారుతోంది,మిలియన్ల మంది పాలస్తీనియన్ పౌరులు, పిల్లలు, మహిళలు, కుటుంబాలు సామూహికంగా శిక్షించబడుతుండటం ప్రపంచం చూస్తోంది’’ అని ఏంజెలీనా పేర్కొంది.

Also Read : Israel Palestine Conflict: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 10వేలు దాటిన మరణాలు, ఇందులో 4100 మంది పిల్లలే

హెర్జోగ్ స్పందిస్తూ, ఏంజెలీనా జోలీ గాజాను సందర్శించలేదని,ఆమె వ్యాఖ్యల ద్వారా తమను తాము రక్షించుకునే సామర్థ్యాన్ని ఇజ్రాయెల్‌లకు అందించడం లేదని ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘నేను ఆమె వాదనలను పూర్తిగా తిరస్కరిస్తున్నాను. ఆమె ఎప్పుడూ గాజాలో ఉండలేదని నేను భావిస్తున్నాను’’ అని హెర్జోగ్ వ్యాఖ్యానించారు.

Also Read : Israel-Hamas : ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గాజాలో 60 శాతం మంది ఉద్యోగాలు ఫట్…అంతర్జాతీయ కార్మిక సంస్థ సంచలన నివేదిక

దయచేసి ఈ ఉగ్రవాదులను నిర్మూలించడానికి ఇజ్రాయెల్‌ను అనుమతించాలని ఆ దేశ అధ్యక్షుడు కోరారు. అక్టోబరు 7వతేదీన హమాస్ చేసిన దాడిని కూడా అధ్యక్షుడు గుర్తు చేశారు. హమాస్ దాడితో అంతటా సైరన్లు మోగాయని, ప్రజలు షెల్టర్లకు పరుగులు తీశారని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఏంజెలీనా జోలీ తండ్రి జోన్ వోయిట్ కూడా తన కుమార్తె వ్యాఖ్యలతో తాను నిరాశ చెందాను అని పేర్కొన్నారు.‘‘ ఇజ్రాయెల్ సైన్యం మీ నేలను, మీ ప్రజలను రక్షించాలి. ఇది యుద్ధం’’ ఏంజెలీనా తండ్రి వ్యాఖ్యానించారు.