Israel-Hamas : ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గాజాలో 60 శాతం మంది ఉద్యోగాలు ఫట్…అంతర్జాతీయ కార్మిక సంస్థ సంచలన నివేదిక

ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పాలస్తీనాలోని గాజా నగరంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల ప్రభావం వల్ల గాజాలో 60 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది.....

Israel-Hamas : ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గాజాలో 60 శాతం మంది ఉద్యోగాలు ఫట్…అంతర్జాతీయ కార్మిక సంస్థ సంచలన నివేదిక

Jobs Lost In Gaza

Israel-Hamas : ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పాలస్తీనాలోని గాజా నగరంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల ప్రభావం వల్ల గాజాలో 60 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారని అంతర్జాతీయ కార్మిక సంస్థ వెల్లడించింది. హమాస్ ఉగ్రవాదుల దాడి అనంతరం ఇజ్రాయెల్ గాజాపై ప్రతి దాడులు ప్రారంభించడంతో పాలస్తీనా భూభాగంలో మొత్తం 1,82,000మంది ఉద్యోగాలు కోల్పోయారని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది.

Also Read : Gaza strip cut : గాజాను రెండుగా చీల్చిన ఇజ్రాయెల్ సైన్యం…ఇరాక్ లో బ్లింకన్ ఆకస్మిక పర్యటన

యుద్ధం కారణంగా 60 శాతం మంది ఉద్యోగాలు కోల్పోవడంతో దాదాపు సగంమంది పేదరికంలో దుర్భర జీవితం గడుపుతున్నారని ఐఎల్ఓ తన నివేదికలో పేర్కొంది. పాలస్తీనాలో యుద్ధం వల్ల మార్కెట్ ఆర్థిక సంక్షోభంలో పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే పాలస్తీనాలో పరిస్థితులు మరింత తీవ్రతరమవుతాయని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అరబ్ రాష్ట్రాల ప్రాంతీయ డైరెక్టర్ రుబా జరాదత్ చెప్పారు. గాజాలో యుద్ధం తెచ్చిన సంక్షోభం వల్ల ఉద్యోగాలు, వ్యాపారాలు దెబ్బతిన్నాయి.

గాజాలో ఆర్థిక సంక్షోభం

ఇరుకైన తీరప్రాంత పాలస్తీనాలో ఉన్న 2.3 మిలియన్ల జనాభాలో సగంమంది పేదరికంలో జీవనం గడుపుతున్నారు. గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ దాడి అనంతరం పరిస్థితులు మరింత దిగజారి ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం నెల రోజులుగా సాగుతోంది. రెండు దేశాల్లోనూ భీకర యుద్ధ వాతావరణం తగ్గుముఖం పట్టలేదు. అక్టోబర్ 7వతేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి 1400 మందికి చావుకు కారణమైంది. ఆ తర్వాత గాజా మీద యుద్ధానికి ఇజ్రాయెల్ ఉపక్రమించింది.

నిత్యావసర వస్తువుల కొరత 

ఇజ్రాయెల్ చేసిన ఈ దాడుల్లో 10,000 మంది పాలస్తీనీలు మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 4,100 మంది పిల్లలే ఉన్నారట.శిథిలాల కింద సుమారు 2,000 మంది ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. భారీ పరికరాలు, యంత్రాలు లేకపోవడంతో వారు బయటకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. ఇజ్రాయెల్ దాడి కారణంగా ప్రజలు ఇంధనం, ఆహారం, విద్యుత్ వంటి నిత్యావసర వస్తువులను పొందలేకపోతున్నారు.

Also Read : BAN vs SL : శ్రీలంక పై బంగ్లాదేశ్ విజ‌యం..

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ ప్రభావాలు ఇప్పుడు లెబనాన్‌లో కూడా కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై యాంటీ ట్యాంక్‌లతో హిజ్బుల్లా తీవ్రవాదులు నిరంతరం దాడులు చేస్తున్నారు. తక్కువ ఇంధన సరఫరా కారణంగా గాజాలోని 35 ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు ఇజ్రాయెల్ చేసిన దాడిలో 25,000 మందికి పైగా గాయపడ్డారు. అదే సమయంలో గాజా నుంచి 15 లక్షలకు పైగా ప్రజలను తరలించినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఇదే సందర్భంలో ఒక పెద్ద వార్తను ఇజ్రాయెట్ ఆర్మీ బయటపెట్టింది.

Also Read : WhatsApp Login : వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై ఫోన్ నెంబర్‌ లేకుండానే లాగిన్ చేయొచ్చు!

గాజాను రెండు ముక్కలు చేశామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతినిధి డేనియల్ హెన్రీ ప్రకటించారు. అంటే ప్రస్తుతం ఉన్న గాజా పట్టీని ఉత్తర గాజా, దక్షిణ గాజాగా విడగొట్టినట్లు ఆయన పేర్కొన్నారు. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి గాజాలో కమ్యూనికేషన్ల వ్యవస్థకు అంతరాయం కలిగింది. ఆదివారం నాడు కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయంగా వచ్చిన అభ్యర్థనను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. ఇజ్రాయెల్ దళాలు గాజా నగరాన్ని విజయవంతంగా చుట్టుముట్టాయి.