Gaza strip cut : గాజాను రెండుగా చీల్చిన ఇజ్రాయెల్ సైన్యం…ఇరాక్ లో బ్లింకన్ ఆకస్మిక పర్యటన
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభం అయి నెలరోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరాన్ని రెండుగా విభజించినట్లు ప్రకటించింది. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి గాజాలో కమ్యూనికేషన్ల వ్యవస్థకు అంతరాయం కలిగింది.....

Gaza strip
Gaza strip cut : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభం అయి నెలరోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరాన్ని రెండుగా విభజించినట్లు ప్రకటించింది. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి గాజాలో కమ్యూనికేషన్ల వ్యవస్థకు అంతరాయం కలిగింది. ఆదివారం నాడు కాల్పుల విరమణ కోసం అంతర్జాతీయంగా వచ్చిన అభ్యర్థనను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. ఇజ్రాయెల్ దళాలు గాజా నగరాన్ని విజయవంతంగా చుట్టుముట్టాయి.
Also Read : Bus Accident : రైల్వే ట్రాక్‌పై నుంచి పడిన బస్సు…నలుగురి మృతి, 28 మందికి గాయాలు
లెబనాన్‌లో సంక్షోభం మరింత పెరిగే ప్రమాదం ఉన్నందున అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్ ఇరాక్ దేశంలో ఆకస్మికంగా పర్యటించారు. సంక్షోభాన్ని పరిష్కరించడానికి బ్లింకెన్ ప్రయత్నాలు చేస్తున్నారు. గాజా ఆదివారం ఇజ్రాయెల్ దళాల బాంబు దాడికి గురైంది. గాజా నగరం ఇప్పుడు రెండు భాగాలుగా విభజించామని రియర్ అడ్మ్ డేనియల్ హగారి తెలిపారు. ఇజ్రాయెల్ మీడియా 48 గంటల్లో గాజా నగరంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఇజ్రాయెల్ తెలిపింది.
Also Read : Ram Temple : అయోధ్యలో రామాలయం ప్రతిష్ఠాపన వేడుకలు…ప్రతీ ఇంటికి అక్షింతల పంపిణీకి ఏర్పాట్లు
ఆదివారం మూడోసారి గాజాలో కమ్యూనికేషన్లు, ఇంటర్నెట్ సేవలు మరోసారి కట్ చేశారు. బ్లింకెన్ కొనసాగుతున్న యుద్ధం మధ్య తన దౌత్య ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదివారం ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌కు వచ్చారు. బ్లింకెన్ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు రెండు శరణార్థుల శిబిరాలపై దాడి చేశాయి. ఈ దాడిలో 53 మంది మరణించారు.
School Principal Arrest : పాఠశాలలో 50 మంది బాలికలపై లైంగిక వేధింపులు…కీచక ప్రిన్సిపాల్ అరెస్ట్
సెంట్రల్ గాజాలో డజన్ల కొద్దీమంది గాయపడ్డారు. హమాస్‌ను అణిచివేసేందుకు తమ దాడిని కొనసాగిస్తామని ఇజ్రాయెల్ పేర్కొంది. సెంట్రల్ గాజా స్ట్రిప్‌లోని రెండు శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ప్రజలు మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.