BAN vs SL : శ్రీలంక పై బంగ్లాదేశ్ విజ‌యం..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో బంగ్లాదేశ్ రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది.

BAN vs SL : శ్రీలంక పై బంగ్లాదేశ్ విజ‌యం..

BAN vs SL (Pic @ANI)

Bangladesh vs Sri Lanka : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో బంగ్లాదేశ్ రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదిక‌గా శ్రీలంకతో జ‌రిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. లంక నిర్దేశించిన ల‌క్ష్యాన్ని 41.1 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బంగ్లాదేశ్ బ్యాట‌ర్ల‌లో న‌జ్ముల్ హుస్సేన్ శాంటో (90; 101 బంతుల్లో 12 ఫోర్లు), షకీబ్ అల్ హసన్ (82; 65 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కాలు చేశారు. లిట‌న్ దాస్ (23), మహ్మదుల్లా (22) లు రాణించారు. దిల్షాన్ మధుశంక మూడు, ఏంజెలో మాథ్యూస్, మహేశ్ తీక్షణ రెండు వికెట్లు తీశారు.

అంత‌క ముందు మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవ‌ర్ల‌లో 279 ప‌రుగులకు ఆలౌటైంది. లంక బ్యాట‌ర్ల‌లో చరిత్ అసలంక (108; 105 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) శ‌త‌కం బాదాడు. పాతుమ్ నిస్సాంక 41, సదీర సమరవిక్రమ 41, ధనంజయ డిసిల్వా 34, మహేశ్ తీక్షణ 22, కుశాల్ మెండిస్ 19 పరుగులు చేశారు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో తాంజిమ్ హసన్ సాకిబ్ మూడు వికెట్లు తీశాడు. షకీబ్ అల్ హసన్, షారిఫుల్ ఇస్లాం లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. మెహిదీ హసన్ మిరాజ్ ఓ వికెట్ సాధించాడు.

Timed OUT : గంగూలీ జ‌స్ట్ మిస్‌.. టైమ్డ్ ఔట్ అయిన మొద‌టి క్రికెట‌ర్ అయ్యేవాడే.. 6 నిమిషాల ఆల‌స్యం.. ఎలా త‌ప్పించుకున్నాడో తెలుసా..?

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక కు శుభారంభం ల‌భించ‌లేదు. కుశాల్ పెరీరా (4) జ‌ట్టు స్కోరు 5 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యాడు. వ‌న్ డౌన్ బ్యాట‌ర్ కుశాల్ మెండీస్ (19)తో క‌లిసి ఓపెన‌ర్ పాతుమ్ నిస్సాంక ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశారు. వీరిద్ద‌రు రెండో వికెట్‌కు 61 ప‌రుగులు జోడించిన త‌రువాత కుశాల్‌ను ష‌కీబ్ పెవిలియ‌న్‌కు చేర్చాడు. కాసేప‌టికే నిస్సాంక కూడా ఔట్ అయ్యాడు.

స‌మ‌ర విక్ర‌మ‌తో జ‌త‌క‌లిసిన అస‌లంక ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకువెళ్లే బాధ్య‌త‌ను భుజాన వేసుకున్నాడు. వీరిద్ద‌రు ఆడ‌పాద‌డ‌పా బౌండ‌రీలు కొడుతూ స్కోరు వేగం ప‌డిపోకుండా చూసుకున్నారు. అర్ధ‌శ‌త‌కానికి చేరువైన స‌మ‌ర విక్ర‌మ ష‌కీబ్ ఔట్ అయ్యాడు. దీంతో 63 ప‌రుగులు నాలుగో వికెట్ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. ఈ ద‌శ‌లో అనూహ్యా ఘ‌ట‌న చోటు చేసుకుంది. సీనియ‌ర్ ఆట‌గాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్‌గా పెవిలియ‌న్‌కు చేరాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో కాసేపు మైదానంలో గంద‌ర‌గోళం నెల‌కొంది.

Angelo Mathews : విచిత్ర రీతిలో ఔటైన శ్రీలంక ఆల్‌రౌండ‌ర్‌.. క్రికెట్ చ‌రిత్ర‌లో టైమ్డ్ ఔటైన తొలి ఆట‌గాడు ఇత‌డే..

ఆ త‌ర‌వాత వ‌చ్చిన డిసిల్వా స‌హ‌కారంలో అస‌లంక చెల‌రేగిపోయాడు. ఈ క్ర‌మంలో వ‌న్డేల్లో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. అయితే.. శ‌త‌కం చేసిన కాసేప‌టికే ఔటైయ్యాడు. మిగ‌తా బ్యాట‌ర్లు పెద్ద‌గా రాణించ‌క‌పోవ‌డంతో ఓ మోస్త‌రు స్కోరుకే శ్రీలంక ప‌రిమిత‌మైంది.